కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ కమెడియన్ గా మారిపోయారు. ఇప్పుడు ఎటు చూసిన హాట్ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఇప్పుడు ఫుల్ హాట్ టాపిక్ గా ఉంది ఆయనే. పాల్ ఎక్కడ ఉంటె నవ్వులే నవ్వులు ఉంటాయి. ఎందుకంటే పొంతన లేని మాటలతో సందడి చేస్తూ ఉంటారు. ఆ టైంకి ఆయనకు ఏది గుర్తొస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. ప్రజలు కామెడీ పీస్ అనుకున్న పర్లేదు నాకు నచ్చిందే చేస్తా ..అనిపించింది మాట్లాడతా..నా దారి రహదారి అనే టైపు లో మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట్లాడే మాటల్లో కొన్ని నిజాలు కూడా ఉంటాయి. ప్రజల్ని ఆలోచింపజేస్తాయి కూడా. ఆయన చెప్పే విషయాలు కన్వే చేసే పద్దతి చూస్తే ప్రజలకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది. ఇక ఇటీవల ఆయన చేసిన పనులు చూస్తే మాత్రం ఫన్నీగా అనిపిస్తుంది. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తన పార్టీలోకి రమ్మంటూ ఆహ్వానించి మంచి కామెడీ చేశారు . తన పార్టీలోకి వస్తే సీఎంను చేస్తానంటూ పాల్ గోల్డెన్ ఆఫర్ ఇచ్చారు. ఇంకా ఆయన ఇచ్చిన ఆఫర్ మీద ప్రజల్లో చర్చలు ఇంకా హాట్ హాట్ గా సాగుతూనే ఉన్నాయి. ఇక తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సాధారణంగా కాలేజీలోకి ఎవరినీ అనుమతించారు. కానీ పాల్ మాత్రం సెక్యూరిటీతో గొడవ పెట్టుకుని మరీ కాలేజీలోకి వెళ్లి ఒక విద్యార్థినికి మంచి ఆరోగ్యం కోసం ప్రసాదించాలని కోరుతూ ప్రార్థన చేసేసరికి పోలీసులు రంగంలోకి దిగి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
కేఏ పాల్ వ్యాఖ్యలపై ఏపీ, తెలంగాణలో రాజకీయ పార్టీలు కానీ, వాటి నేతలు కానీ ఎక్కడా స్పందిస్తున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. అయినా పాల్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ఫన్నీ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తద్వారా కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో వచ్చే ఏడాది, ఏపీలో రెండేళ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే ఆయన ఇప్పటి నుంచే యాత్ర పేరుతో పాల్ చేస్తున్న హడావిడిని చూసి జనం నవ్వుకుంటున్నారు. కానీ తెలంగాణాలో మాత్రం రాబోయేది తన ప్రభుత్వమే అని ఆయన జోస్యం చెప్పేసారు. ఇక ఈ ఎలక్షన్స్ లో తాను ఎమ్మెల్యే గా పోటీ చేసి సీఎం అవుతానని కూడా చెప్పారు. ఏపీలో టీడీపీ, వైసీపీలు లక్షల కోట్లు ఖర్చుపెట్టి కాపిటల్ కట్టలేకపోయారంటూ పాల్ మాట్లాడిన మాటలు ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి,. చంద్రబాబు, జగన్ బీజేపీకి సరెండర్ అయిపోయారని కూడా విమర్శించారు. తెలంగాణను ఫ్యామిలీలు ఫ్యామిలీలో పాలిస్తున్నాయని ప్రస్తుతం దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని పాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తాను అంటే చాలా గౌరవం అని పాల్ మనసులో మాట చెప్పారు. ఇప్పటికి ఎన్నో సార్లు తనను ప్రజాశాంతి పార్టీలోకి రమ్మని ఆఫర్ ఇచ్చానంటూ మస్త్ కామెడీ చేశారు.
