టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా లైగర్. ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన ఈ చిత్రం ఆగష్టులో రిలీజ్ కు రెడీ అవుతోంది. విజయ్ దేవరకొండ టాలీవుడ్ లోకి వచ్చాక చాలా తక్కువ మూవీస్ లో నటించి ఎంతో ఎత్తుకి ఎదిగాడు. ఇక ఈ చిత్రం లైగర్ రిలీజ్ కోసం పాన్ ఇండియా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక లైగర్ రిలీజ్ కి ముందే వీరి కాంబినేషన్ లో మరో సినిమాను కూడా అనౌన్స్ చేసేసారు. పూరి డ్రీం ప్రాజెక్ట్ ఐన జనగణమన సినిమాను విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్లు ఆల్రెడీ ప్రకటించేశాడు. గతంలో ఈ సినిమా కోసం చాలా మంది హీరోలను అనుకున్నాడట కానీ అది వర్కౌట్ కాకపోవడంతో ఫైనల్లీ లైగర్ తోనే ఈ మూవీ చేస్తున్నట్లు ప్రకటించేసరికి క్రేజ్ తో పాటు అంచనాలు కూడా అమాంతం పెరిగాయి. జనగణమణ సినిమాలో విజయ్ దేవరకొండకు జంటగా పూజా హేగ్దే నటించబోతున్నట్టు సమాచారం.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ న్యూ లుక్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. విజయ్ ఇప్పటివరకు కనిపించని ఆర్మీ సోల్జర్ పాత్రలో కనిపించబోతున్నాడు. కానీ ఈ సినిమా వివాదాలతో కూడుకున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ కు ముందే జనగణమణ కు ప్రాబ్లమ్స్ తప్పవంటున్నారు. ఈ మూవీ కాన్సెప్ట్ వివాదాల్లోకి వెళ్లబోతుంది అని తెలుస్తుంది. అందుకు కారణం ఈ సినిమా కథనే అనేది బయట వినిపిస్తున్న వాదన. ఈ సినిమాలో సైనిక పాలన చూపించబోతున్నారు అని తెలుస్తుంది. ప్రభుత్వం లేన్నపుడు సైనికులు తమ దేశం కోసం ఏం చేస్తారు అనే అంశంలో ఈ సినిమా కథ సాగనుంది అని సమాచారం. అయితే ఈ సైనిక పాలన అనేది వివాదాస్పద అంశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా రిలీజ్ సంగతి తరువాత ముందు షూటింగ్ టైమ్ లో ఆ తరువాత సెన్సార్ టైమ్ లో ఎన్ని వివాదాలు ఫేస్ చేస్తుందో అన్న సందేహాలు ఆల్రెడీ వ్యక్తమవుతున్నాయి. ఇక చూడాలి అసలు ఈ మూవీ ఎలా ఉండబోతోంది..ఎలా డీల్ చేయబోతున్నారు..స్టోరీ ఏమిటి..లుక్ ఏమిటి అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.