మొన్నటి వరకు ఉడత ఇష్యూ హాట్ టాపిక్ ఐతే ఇప్పుడు లేటెస్ట్ గా చంద్రబాబు చేతి ఉంగరం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబు చేతి వెలికి ఉంగరం పెట్టుకున్నారు. అసలు ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు ధరించని చంద్రబాబు మొదటిసారిగా ఉంగరం ఎందుకు పెట్టుకున్నారు ? అసలెందుకు పెట్టుకున్నారు ? చంద్రబాబు ఏమన్నా దేవుళ్లను, జాతకాలను నమ్మని పెద్దమనిషికి సడెన్ గా దైవభక్తి పెరిగిపోయిందా అనే విషయం పై జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఇలాంటి రింగ్ పెట్టుకుంటే కింగ్ అవుతాడని.. అధికారం ప్రాప్తిస్తుందని ఏ సాములోరైనా చెప్పారా ? అన్న అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆహార్యం చాలా సాదాసీదాగా ఉంటుందన్న విషయం తెలిసిందే. చేతికి గడియారం గానీ, వేళ్లకు ఉంగరాలు గానీ, రోజుకో రీతిన డ్రెస్సింగ్ లో కానీ ఆయన ఎప్పుడూ కనిపించరు. ఎప్పుడూ ఒకే రకం కలర్ షర్ట్, ప్యాంట్‌తో కనిపించే చంద్రబాబులో ఇప్పటిదాకా పెద్దగా మార్పేమీ లేదనే చెప్పాలి. తాజాగా ఆయన వేలికి ఓ ప్లాటినం ఉంగరం కనిపించేసరికి అందరూ షాక్ అవుతున్నారు. అన్నమయ్య జిల్లా పరిధిలోని మదనపల్లెలో జరిగిన టీడీపీ మినీమహానాడుకు హాజరైన సందర్భంగా చంద్రబాబు చూపుడువేలికి ప్లాటినం ఉంగరం కనిపించింది. దీనిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొనగా సమావేశం తర్వాత జరిగిన సమీక్షలో పార్టీ నేతల వినతి మేరకు చంద్రబాబు ఆ ఉంగరం ప్రత్యేకతలను వివరించారు.
చంద్రబాబు వాచీలు, ఉంగరాలు లాంటి వాటిని పెట్టుకోరు. మరి ఇప్పుడెందుకు పెట్టుకున్నారని ఎక్కువ మందికి డౌట్ వస్తోంది. అయితే ఆ ఫోటోలను కాస్త పరిశీలనగా చూసిన వారికి, ఆయన ఉంగరంగాపెట్టుకున్న రింగ్ అనబడే వస్తువును పరిశీలన చూస్తే మాత్రం డౌట్ రావడం సహజం. ఎందుకంటే అది బంగారం కాదు, ప్లాటినం కాదు. మరేంటి ? చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు వేళ్లకు పెట్టుకునే ఫిట్ నెస్ బ్యాండ్స్ వచ్చాయి. అలాంటి ఫిట్‌నెస్ బ్యాండ్‌ను చంద్రబాబు తన వేలికి పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ప్లాటినం ఉంగరంలో ఓ చిప్ ఉందని… అది తన హార్ట్ బీట్, స్లీపింగ్ అవర్స్, ఆహారం తదితర అంశాలన్నింటినీ రికార్డు చేస్తుందన్నారు. ఆ వివరాలను ప్లాటినం ఉంగరం ఎప్పటికప్పుడు తన కంప్యూటర్‌కు పంపుతుందని కూడా చంద్రబాబు తెలిపారు. ఆరోగ్య పరంగా ఎంత బిజీగా ఉన్నా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాయమం చేశారు. ఎంత కెలోరీలు ఖర్చయ్యాయి. దగ్గర్నుంచి ఆ బ్యాండ్ లాంటి రింగ్ పెట్టుకుంటే చాలా వరకూ శరీరంలో జరిగిన మార్పుల గురించి స్పష్టత వస్తుందంటున్నారు. ఈ విషయం తెలియక చాలామంది జాతకాలు, నమ్మకాలు అంటూ ఏదేదో ఆలోచిస్తున్నారు.