రాష్ట్ర ప్రభుత్వం దావోస్ వెళ్లి బైజూస్ టెక్నో కంపెనీతో ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థ ఉపాధ్యాయ వ్యవస్థ , విద్యార్థుల మీద దుష్పరిమాణాలు ఉండే ఈ చీకటి ఒప్పందంని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ యువత విద్యార్థి వివిధ రాజకీయ పార్టీలతో కలుపుకొని అఖిలపక్షం రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో టిడిపి నుంచి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ రాజా మాస్టర్, ఎమ్మెల్సీ రామకృష్ణ, ఎస్ టి యు అరుణ్, ఏపీటీఎఫ్ బసవ లింగరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి రామారావు, సిపిఐ జిల్లా యువత వల్లి, తెలుగుదేశం బహుజన సంఘాలు, తెలుగు యువత, వామపక్ష యువత, విద్యార్థి యువజన సంఘాలు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ తీర్మానాలు
తక్షణమే బైజూస్ + రాష్ట్ర ప్రభుత్వం కలసి చేసిన ఒప్పందాన్ని ప్రజల ముందుంచాలి. అదే విధంగా విద్యా వ్యవస్థను, విద్యార్థులను, టాబ్లను , ఎంతమందికి ఏ తరగతులకు ఇస్తున్నారో దాని వ్యయం ఎంతో ? ఏ ఏ రూపాలోలో చెల్లిస్తున్నారొ ప్రజలకు చెప్పాలి. తల్లి, తండ్రి, గురువు, విద్యార్థి ఇది ఒక కుటుంబ వ్యవస్థ లాంటిది దీనిని నష్టపరిచే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను మెరుగు పరచుటకు ఖాళీగా ఉన్నా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు.. డీఎస్సీ ని వెంటనే ప్రకటించాలని కోరారు..