వందేళ్ల నాటి చరిత్రాత్మక పార్లమెంట్ భవనంలో చివరి సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 12 వర కు ఇక్కడ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగు తాయి. డిసెంబరులో జరిగే శీతాకాల సమావేశాలు సెంట్రల్ విస్తాలో భాగంగా మోదీ ప్రభుత్వం నిర్మిస్తు న్న నూతన పార్లమెంట్ భవనంలోనే జరుగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే ప్రకటించారు. 17వ లోక్‌సభ 9వ సమావేశాలు, 257వ రాజ్యసభ సమావేశాలతో పాటు నూతన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక పాత పార్లమెంట్ భవనంలోనే జరగనుంది. సమావేశాల తొలిరోజే రాష్ట్రపతి పదవికి, ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతాయి. రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్యనాయుడు పదవీకాలం కూడా పాత పా ర్లమెంట్ భవనంలోనే ముగిసిపోనుంది. కాగా చట్ట సవరణ బిల్లులను గతంలో ప్రభుత్వం పార్లమెంటరీ స్థాయీ సంఘాల పరిశీలనకు పంపించింది. కమిటీలు ఆ బిల్లులను పంపిస్తే వర్షాకాల సమావేశాల్లో వాటిని ఆమోదించే అవకాశం ఉంది.
పాత భవనం చరిత్ర ఏమిటి ?
ప్రస్తుతం ఉన్న బ్రిటిష్ కాలం నాటి పార్లమెంటు భవనానికి న్యూదిల్లీ రూపకర్తలు ఎడ్విన్ లుట్యెన్స్, హెర్బెర్ట్ బేకర్ డిజైన్ చేశారు. ఈ భవనానికి 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది. అప్పట్లో దీనికి 83 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. దీనిని 1927 జనవరి 18న అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్ట్ ఇర్విన్ ప్రారంభించారు. ప్రస్తుత పార్లమెంట్ భవనం వృత్తాకారంలో 560 అడుగుల వ్యాసార్థంతో ఉంటుంది. పార్లమెంటు హౌస్ ఎస్టేట్‌ను ఎర్రటి శాండ్‌స్టోన్‌తో, ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసివేసేలా ఇనుప గ్రిల్స్, ఇనుప తలుపులతో నిర్మించారు. దీనికి మొత్తం 12 గేట్లు ఉన్నాయి.
కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం
2020 అక్టోబర్‌లో లోక్‌సభ సెక్రటేరియట్ వివరాల ప్రకారం కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్‌లో మొదలై, 2022 అక్టోబర్ నాటికి పూర్తి కావచ్చు. కొత్త భవనం ఎందుకన్న తృణమూల్ ఎంపీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి హర్దీప్ పురి, ప్రస్తుత పార్లమెంట్ భవనంలో ఉన్న వసతులు, సౌకర్యాలు 93 ఏళ్ల పురాతనమైనవని, పార్లమెంట్ ప్రస్తుత డిమాండుకు అవి తగినట్లు లేవని చెప్పారు. “లోపల తగినంత ఆఫీస్ స్పేస్ లేదు. ఎంపీలకు వ్యక్తిగత చాంబర్లు కూడా లేవు. ఈ భవనం ఉభయ సభల పార్లమెంటుకు ఉద్దేశించినది కాదు. ఏళ్ల తరబడి పెద్ద ఎత్తున మరమ్మతులు జరగడం వల్ల దానిపై చాలా ఒత్తిడి ఉంది. కొత్త భవనంలో మెరుగైన సీటింగ్ సామర్థ్యం ఉంటుంది” అని కూడా పురి చెప్పారు. ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అందిస్తుందని, రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియాగేట్ వరకూ విస్తరించిన ప్రాంతాన్ని సందర్శించే పర్యటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు.