దేశంలో కీలకమైన ఉప ఎన్నికల సమరం మొదలైంది. 3 లోక్ సభ , 7 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లుచేశారు.
బైపోల్స్ 2022 : ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికల సమరం మొదలైంది. ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం మూడు లోక్ సభ, 7 అసెంబ్లీ సీట్లకు గురువారం ఉపఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. అధికారులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటుచేశారు.
ఢిల్లీ.. పంజాబ్..
ఢిల్లీ, పంజాబ్ ఉపఎన్నికలపై ఆప్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్న ఆ పార్టీ.. తన బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. రాజేందర్ నగర్ నియోజకవర్గంలో ‘ఉప’ పోరు నడుస్తోంది. ఇక్కడ అధికార ఆప్, విపక్ష బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం మీద 1.6 లక్షల మంది ఓటర్లు ఉండగా 14 మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు.
ఉపఎన్నికలు
పంజాబ్లోని సంగ్రూర్లో ఉప ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రిగా గెలుపొందిన అనంతరం సంగ్రూర్ ఎంపీగా భగవంత్ మన్ రాజీనామా చేయడంతో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా పంజాబ్లో సిద్ధూ మూసేవాలా మరణం అనంతరం అక్కడి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మరి తాజా ఎన్నికల్లో 15లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకుని ఎవరిని గెలిపిస్తారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
బరిలో సీఎం..
త్రిపురలోనూ ఈ ఉపఎన్నికలు కీలకంగా మారాయి. స్వయంగా ఆ రాష్ట్ర సీఎం మానిక్ సాహా ఈ ఉపఎన్నికలో బరిలో ఉండటం ఇందుకు కారణం. బోర్దోవాలి నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో నిలబడ్డారు. అగర్తల, సుర్మా, జబరాజ్నగర్లోనూ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. అప్పటివరకు ముఖ్యమంత్రిగా విప్లవ్ దేవ్పై అసంతృప్తి పెరగడంతో ఆయన్ని తప్పించి మానిక్కు అవకాశం ఇచ్చింది కమలదళం. మరికొన్ని నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల ఈ ఉప ఎన్నికలు మరింత కీలకంగా మారింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూర్, ఝార్ఖండ్ మాందర్, ఉత్తర్ప్రదేశ్ అజామ్గఢ్, రామ్పూర్లో ఉప సమరం నడుస్తోంది.
ఆత్మకూరులో కొనసాగుతున్న పోలింగ్
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉపఎన్నికకు మొత్తం 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ బైపోల్ కు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఉప ఎన్నికల్లో మొత్తం 279 పోలింగ్ కేంద్రాలలో 1200 మంది పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. మాజీ మంత్రి గౌతంరెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు స్థానానికి ఉపఎన్నిక జరుగుతుంది. ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో 14 మంది అభ్యర్ధులు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో ఉన్నారు.
ఆత్మకూరు ఉప ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆత్మకూరు మండలంలో 52,155 మంది, అనంతసాగరంలో 35,002 మంది, చేజర్లలో 27,894 మంది, మర్రిపాడులో 34,859 మంది, ఏఎ్‌సపేటలో 28,026 మంది, సంగంలో 35,402 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకుగాను 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు తదితర సామగ్రిని తీసుకుని ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది బుధవారం సాయంత్రానికల్లా నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో పోలింగ్ సామగ్రిని తరలించారు. ఎన్నికల్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
నేడు ఆత్మకూరులో ఉప ఎన్నికకు పోలింగ్
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750నెల్లూరు: నేడు (గురువారం) ఆత్మకూరు ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. మాజీ మంత్రి గౌతంరెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు స్థానానికి ఉపఎన్నిక జరుగుతుంది. ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో 14 మంది అభ్యర్ధులు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో ఉన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 2,13,338 మంది ఓటర్లున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆత్మకూరు ఉప ఎన్నిక కోసం మొత్తం 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 131 సమస్యాత్మక, 148 సాధారణ పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉపఎన్నికను అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్ లైవ్ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. ఎన్నికల విధుల్లో 1,409 పోలింగ్ సిబ్బంది, 1100 మంది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
భారీ మెజారిటీకి వైసీపీ యత్నాలు
శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక గురువారం జరుగనుంది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పోటీలో లేని కారణంగా.. భారీ మెజారిటీపై వైసీసీ కన్నేసింది. కనీసం లక్ష ఓట్ల ఆధిక్యంతో గెలిచేందుకు రకరకాల యుక్తులు పన్నుతోంది. 2019 ఎన్నికల్లో నియోజకవర్గంలో 82 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం పోలైన ఓట్లలో టీడీపీకి 40.44 శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుత ఉప ఎన్నిక బరిలో టీడీపీ లేని కారణంగా ఆ పార్టీ సానుభూతిపరులు ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశాలున్నాయి. అదే జరిగితే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిపోవచ్చు. 70శాతానికి పైబడి పోలింగ్ జరిగితే తప్ప లక్ష ఓట్ల మెజారిటీ సాధ్యం కాదు. ఇంకోవైపు.. జగన్ ప్రభుత్వంపై జనంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఓటర్లను పోలింగ్ బూత్ వరకు రప్పించేందుకు వలంటీర్లను ఉపయోగించుకుంటున్నారని వాదన వినిపిస్తుంది. చివరి అస్త్రంగా టీడీపీ గ్రామస్థాయి నాయకులకు రకరకాల ఆశలు చూపుతున్నట్లు సమాచారం.
గ్రామాల్లో ప్రతి 50 మంది ఓటర్లకు ఒక టీమ్ లీడర్లును కేటాయించి వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించే బాధ్యతను అప్పగించినట్లు సమాచారం. టీం లీడర్లను, ఓటింగ్ తీరుతెన్నులను గంట గంటకు పర్యవేక్షిస్తూ దిశదశ నిర్ధేశించేందుకు వారిపై కొందరు నాయకులను నియమించినట్లు తెలుస్తోంది. వీరికితోడుగా పొదుపు గ్రూపు సభ్యులు, అంగనవాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లకు సైతం వైసీపీకి ఓటు వేయించేలా సహకరించాలని ఆ పార్టీ నేతలు అనధికారిక సూచనలు ఇచ్చినట్టు విమర్శలు ఉన్నాయి.
ఆత్మకూరులోని బట్టేపాడులో ఉద్రిక్తత.. పోలీసులు, స్వతంత్ర అభ్యర్థి శశిధర్‌రెడ్డికి మధ్య వాగ్వాదం
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడులో ఉద్రిక్తతపోలింగ్ కేంద్రంలో వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారని ఆరోపణతో వైకాపా నాయకుల ప్రచారాన్ని అడ్డుకున్న స్వతంత్ర అభ్యర్థి పట్లు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అభ్యర్థి శశిధర్‌రెడ్డి ఆరోపణ … దీంతో పోలీసులు, స్వతంత్ర అభ్యర్థి శశిధర్‌రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది…
23బ్రాహ్మణపల్లిలో ఓటేసిన వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి
ఆత్మకూరులో కొనసాగుతున్న ఉపఎన్నిక పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. ఆత్మకూరు బ్రాహ్మణపల్లిలో కుటుంబంతో కలిసి ఓటేసిన వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి.