కొన్నాళ్ళ క్రితం క్రికెట్ ఐపీఎల్ కి ఒక యాడ్ వచ్చేది అందులో అరే జంపింగ్ జపాక్ అని ఒక సాంగ్ బిట్ అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు ఆ యాడ్ ఏమన్నా చూసిందో ఏమో గానీ అర్జెంట్ గా రాష్ట్ర సచివాలయంలో ఈ జంపింగ్ జపాక్ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది. “జంపింగ్ ఫైల్స్” అంటూ ఒక కొత్త నిర్ణయాన్ని తీసికొనివచ్చింది. ఫైల్స్ జంపింగ్ అంటే ప్రభుత్వ నిర్ణయాలను సంబంధించిన ఫైల్స్ అన్నీ ఎవరికి వారి ఇష్టారాజ్యంగా సృష్టించొచ్చు,ముందుకు తీసుకెళ్లొచ్చు. అన్ని స్థాయిల్లోనూ చెక్ చేయాల్సిన పని లేదు అన్నమాట.
పూర్వం ఏపీ సెక్రటేరియట్ ఆఫీసు మాన్యువల్ 2005 ప్రకారం పని విధానం నిర్దేశించి ఉంది. ఈ మాన్యువల్ పేరా 10(B) (A) ప్రకారం ఫైళ్లన్నీ A.B,C గ్రూపులుగా విభజించి వాటి అవసరాన్ని బట్టి ప్రతి వారం, 15 రోజు లకోసారి వాటిని సమీక్షించే విధానం ఉంది. రహస్యాలు, ప్రభుత్వ చట్టాలకు మార్పులు వంటి కీలక దస్త్రాలన్నీ ఆదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి సంరక్షణలోనే ఉండేవి.ఫైళ్లను సెక్షన్ అధికారి నుంచి అనేక స్థాయిల్లో అధికారులు చూసి పరిష్కరించడమో, నిర్ణయాలు తీసుకోవడమో జరుగుతోంది. కొన్ని పైళ్ల విషయంలో ఆయా స్థాయిల్లో ఎలాంటి నిర్ణయాలూ లేకుండానే కదులుతూ ఉండేవి.
మార్పులు చేసిన తరువాత నిర్దేశించినట్లు పైళ్లు అన్ని స్థాయిలకు వెళ్లాల్సిన అవసరం లేదు. జంప్ చేయించవచ్చు
ఫైలు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ స్థాయి నుంచి అధి కారి స్థాయి వరకు ఎక్కడో అక్కడ సిద్ధం చేయవచ్చు. ఈ విషయాన్ని ఆ ప్రభుత్వశాఖ కార్యదర్శి లేదంటే ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిర్ణయిస్తారు.ఫైలు సిద్ధం చేసిన దశ నుంచి నిర్ణయం తీసుకునే వరకు నాలుగు స్థాయిలు దాటి వెళ్లకూడదు. మంత్రిని కూడా కలిపి నాలుగు స్థాయిలు నిర్ణయిస్తారు అన్నమాట.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొనే ప్రతి నిర్ణయం ఏదో ఒక వివాదానికి కారణం అవుతుంది. నియమ నిబంధనలు ఉల్లంఘిస్తుంది. అందుకే ప్రభుత్వ జీవో లను వెబ్సైట్ లో ఉంచడం లేదు. తాజాగా ఈ జంపింగ్ ఫైల్స్ నిర్ణయం, దీని ద్వారా ఫైల్స్ అందరి వద్దకు వెళ్ళనవసరం లేదు కాబట్టి అవినీతి, రహస్య ఫైల్స్ తో పని నడిపించుకొవచ్చు