చదువుల మీద పెట్టే ప్రతిపైసా.. పవిత్రమైన పెట్టుబడి అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులతో పిల్లలను చదివించలేని పరిస్థితి శాపం కాకూడదన్నారు. పిల్లలను బాగా చదివించినప్పుడే వాళ్ల జీవితాలు మారుతాయని చెప్పారు. నాణ్యమైన చదువులు మన రాష్ట్రంలో ప్రతీ ఇంట్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏపీలో గత మూడేళ్లుగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న సీఎం జగన్.. మనిషి తలరాతను మార్చేసే శక్తి చదువుకు ఉందని తెలిపారు. అక్షరాల 43 లక్షల 96 వేల మందికి పైగా తల్లులకు, తద్వారా దాదాపుగా 80 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. అక్షరాల 6, 595 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలో నేరుగా జమ చేసే గొప్ప కార్యక్రమం ఇదని తెలిపారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన అమ్మఒడి మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమం సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రసంగించారు. చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ..ప్రతి చిట్టి తల్లికి, ప్రతి చిట్టిబాబుకు మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు. ఈ రోజు దేవుడి దయ వల్ల మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అక్షరాల 43 లక్షల 96 వేల మందికి పైగా తల్లులకు, తద్వారా దాదాపుగా 80 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. అక్షరాల 6, 595 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలో నేరుగా జమ చేసే గొప్ప కార్యక్రమం ఇది. ప్రతి అక్క చెల్లెమ్మ తమ పిల్లలు, వారి భవిష్యత్ కోసం ఆలోచన చేసే క్రమంలో అక్కచెల్లెమ్మలకు ఒక మంచి అన్నయ్య వాళ్లకు తోడుగా ఉన్నానని తెలియజేసే ఈ కార్యక్రమం.. దేవుడి దయ వల్ల ముందుకు సాగుతోంది. మీ కుటుంబ భవిష్యత్ మీ పిల్లల చదువుల్లో చూసుకుంటున్న తరుణంలో మీ అన్న, మీ తమ్ముడు..మీ వైయస్ జగన్ బెస్ట్ విసెష్ చెబుతున్నాడు. ఒక మనిషి తలరాతను మార్చగలిగే శక్తి ఒక చదువుకు మాత్రమే ఉంది. ఒక కుటుంబం తలరాత మార్చేది చదువే. సమాజం, దేశం తలరాతను మార్చే శక్తి చదువుకే ఉంది. చదువులు బాగా ఉన్న దేశాల్లో ఆదాయం కూడా ఎక్కువే. అక్కడి ప్రజలు మనకన్నా ఎక్కువ ఆదాయం ఉంది. మనకంటే వారి తలసరి ఆదాయం ఎక్కువగా ఉండటానికి చదువే కారణం. అందుకే తేడా కనిపిస్తుంది. చదువే నిజమైన ఆస్తి. ఏ ప్రభుత్వమైనా చదువుపై పెట్టే ఖర్చు వృథా కాదు.ప్రతిపైసా కూడా పవిత్రమైన పెట్టుబడి. విమర్శించే వారికి కూడా ఇదే చెబుతున్నాను.
ఒక తరాన్ని, వాళ్ల తలరాతలను మార్చే శక్తి చదువులకు ఉంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి బతకగలిగే శక్తి చదువుతోనే వస్తుంది. అలాంటి నాణ్యమైన చదువులు మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు అందాలని, దక్కాలని తపన, తాపత్రయంతో గత మూడేళ్లుగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాను. దేశంలో అన్ని రాష్ట్రాలకు మిన్నగా ప్రతి ఒక్కరికి మంచి చదువులు అన్నది ఒక్క హక్కుగా, బాధ్యతగా అందేలా మన ప్రభుత్వం నిండు మనసుతో అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు శ్రీకారం చుడుతున్న జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం. ఈ పథకం ఓ గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నాను. ఈ రోజుకు ఈ పథకం మూడో ఏడాది అమలు చేస్తున్నాం. బడికి పంపించే ప్రతి తల్లికి జగనన్న అమ్మ ఒడి డబ్బులు ఈ రోజున ఇక్కడి నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి ఒక్కరికి మంచి జరిగిస్తూ రూ.44,96,402 మంది తల్లుల ఖాతాల్లోకి జగనన్న అమ్మ ఒడి కింద 6,595 కోట్లు జమ చేస్తున్నాం. ఈ ఒక్క పథకం ద్వారా ఈ మూడేళ్లలో నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేసింది అక్షరాల రూ.19,618 కోట్లు. మీ పిల్లలను చదివించండి. మీకు తోడుగా మీ అన్న మీకు అండగా ఉంటాడని ప్రోత్సాహకంగా ఈ పథకం ద్వారా డబ్బులు జమ చేస్తున్నా. ఏ తల్లి అయినా కూడా తన పిల్లలను గొప్పగా చదివించాలని ఆరాట పడుతుంది. మధ్యలో చదువులు ఆపకూడదని భావిస్తుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదివించలేని పరిస్థితి శాపంగా మారకూడదు.
నా పాదయాత్రలో ప్రతి తల్లి కష్టాన్ని కళ్లారా చూశాను. ప్రతి చెల్లెమ్మకు నేనున్నానని అక్షరాల చెప్పాను. చెప్పిన ఆ మాటను నిలబెట్టుకుంటూ మూడో ఏడాది వరసగా అమలు చేస్తున్నానని సగర్వంగా చెబుతున్నారు. ఈ పథకం ద్వారా పిల్లలను చదివిస్తే చాలు ప్రైవేటు, గవర్నమెంట్, ఎయిడెడ్ స్కూళ్లలో ఎక్కడా చదివించినా ఎలాంటి అభ్యంతరం లేదు. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఆర్థికసాయం అందించే గొప్ప కార్యక్రమం అమ్మ ఒడి.
ఎంత మంది ఎక్కువ పిల్లలు చదువుకుంటే అంత సంతోషం. ఎంత మంది తల్లులకు అమ్మ ఒడి అందితే అంత ఆనందం. పిల్లలు బడికి వెళ్తేనే చదువు వస్తుంది. కాబట్టే కనీసంగా 75 శాతం అటెండెన్స్ కచ్చితంగా ఉండాలని జీవో ఇచ్చాం. బడి నాలుగు రోజులు జరిగితే కనీసం మూడు రోజులు బడికి వెళ్లాలి. ఎందుకంటే పిల్లల్ని ఒక తపస్సులా చదివించినప్పుడే పిల్లల జీవితాలు బాగుపడుతాయి. అప్పుడే ఆ కుటుంబాల తలరాతలు మారుతాయి. ఈ పథకం మీ అందరికీ తెలిసిందే 2019లో అమలు చేశాం. 2019–2020లో తొలిసారిగా ప్రారంభించాం. అప్పుడే 75 శాతం అటెండెన్స్‌కు మినహాయింపు ఇచ్చాం. 2020–2021 ఏడాదిలో అనుకోకుండా కోవిడ్ రావడంతో 75 శాతం హాజరును మినహాయించి డబ్బులు ఇచ్చాం. గతేడాది నుంచి బడులు నడుస్తున్నాయి. బడి జరిగిన రోజుల్లో కనీసం 75 శాతం హాజరు నిబంధన అమలులోకి రావడంతో 51 వేల మంది తల్లులు లబ్ధి పొందలేకపోయారు.
మరోరకంగా చెప్పాలంటే 44,47,402 తల్లులకు గాను 43,96,402 తల్లులకు అమ్మ ఒడి పథకం ఇవ్వగలిగాం. 1.14 శాతం తల్లులకు ఇవ్వలేకపోయాం. ఈ విషయం చాలా బాధాకరం. భవిష్యత్‌లో ఈ కార్యక్రమం 75 శాతం హాజరు నిబంధనలతో అడుగులు వేయాలి కాబట్టి నియమ నిబంధలు కచ్చితంగా పాటించాలి. పిల్లలను క్రమం తప్పకుండా బడులకు పంపించాలి. బాధనిపించినా కూడా ఆ 51 వేల మంది అక్కచెల్లెమ్మలకు న్యాయం చేయలేకపోయాను. భృహత్తర యజ్ఞం కోసం అడుగులు ముందుకు వేస్తున్నాం. మనం అమలు చేస్తున్న జగనన్న విద్యా కానుక, జగనన్న కానుక, జగనన్న వసతి దీవెన, సీబీఎస్‌ఈ, ఇంగ్లీష్‌మీడియం, బైజూస్‌తో ఒప్పందం ఇవన్నీ కూడా మన పిల్లలకు మేలు చేస్తున్నాయి. ప్రపంచంలో పోటీ పడే పరిస్థితి రావాలనే కచ్చితంగా 75 శాతం హాజరును నిబంధనగా పెట్టాం.
మన పిల్లలందరూ ప్రభుత్వ బడులకు వెళ్తున్నారు. నాడు–నేడుతో మన బడుల రూపురేఖలు మారుతున్నాయి. మంచి బడులుగా ఉండాలంటే ప్రతి తల్లి కూడా బాధ్యత తీసుకోవాలి. తమ పిల్లలు వెళ్లే ఆబడుల గురించి ఆలోచన చేయాలి. ఆ బడుల్లో ఉన్న టాయిలెట్ల గురించి ఆలోచన చేయాలి. పిల్లలకు మంచి వాతావరణం కోసం టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ ఏర్పాటు చేశాం. అమ్మ ఒడి సొమ్ములో నుంచి కాస్తంత సొమ్ము టీఎంఎఫ్‌కు ఇవ్వాలని కేటాయించాం. ఎస్‌ఎంఎఫ్(స్కూల్ మెయింటె¯ð న్స్ ఫండ్)తో స్కూళ్ల రూపురేఖలు మార్చుతున్నాం. ఆ స్కూళ్ల మరమ్మతుల కోసం కాస్తోకూస్తో కేటాయింపులు చేయాలి. అందుకే అక్కచెల్లెమ్మలకు ఇచ్చే అమ్మ ఒడి డబ్బుల్లో నుంచి కాస్త ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మన స్కూళ్లలో మీ పేరెంట్ కమిటీ, హెచ్‌ఎం పర్యవేక్షణలో ఖర్చు చేస్తారు. మన పిల్లలు వెళ్లే స్కూళ్ల బాగోగుల కోసమే ఈ డబ్బును ఉపయోగిస్తారు. ప్రతి చెల్లెమ్మ కూడా ఆ స్కూళ్ల పరిస్థితిపై ప్రశ్నించే హక్కు వస్తుంది. బాధ్యతగా ఆ డబ్బును ఖర్చు చేసి స్కూళ్లు బాగుండేలా చూస్తారు. ఈ రూ.2 వేలకు సంబంధించి కొందరు విమర్శలు చేస్తున్నారు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తోంది. ఇలా విమర్శలు చేసే ఏ ఒక్కరైనా కూడా వారి జీవితంలో ^è దివించే అమ్మకు ఒక్క రూపాయి అయినా అమ్మలకు ఇచ్చారా?. ఇలాంటి స్కీమ్‌లు పెట్టాలని ఏనాడు ఆలోచన చేయని వారు ఇలా విమర్శలు చేయడం ఎంతవరకు న్యాయం.
మనది నిజంగా ఎగ్గోట్టే ప్రభుత్వమే అయితే మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం అమలు చేసేవారమా? ఒక్కసారి ఆలోచన చేయండి. మేనిఫెస్టోను భగవత్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఒక్కరికి డబ్బులు నేరుగా జమ చేస్తున్నాం. మీ పిల్లలు చదువుకునే స్కూళ్ల రిపేరీలకు ఖర్చు చేస్తున్నామని చెప్పే వారమా? డబ్బు ఎగ్గొట్టాలని అనుకుంటే పిల్లలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని ఆలోచన చేసేవారమా ? ఈ రోజు దేశంలోనే అతిపెద్ద బైజూస్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. బైజూస్ యాప్‌ను పేదపిల్లలకు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నాం. 8వ తరగతిలో అడుగు పెట్టేబోయేప్రతి విద్యార్థికి ఈ సెప్టెంబర్ నుంచే అక్షరాల రూ.12 వేల ఖర్చు అయ్యే ట్యాబ్‌ను ఉచితంగా ఇస్తున్నాం.
విమర్శలు చేసే చంద్రబాబు, దుష్ట చతుష్టయంలోని రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు ఇటువంటి నిజాలు ఏనాడైనా చెప్పే ధైర్యం, నిబద్ధత వీరికి ఉందా? అని అడుగుతున్నాను. బైజూస్‌యాప్ ద్వారా వీడియోలు, యానిమేషన్‌బొమ్మలతో 4వ తరగతి నుంచి మరింత సులభంగా, సమగ్రంగా పాఠ్యాంశాలు అర్థమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సీబీఎస్‌ఈతో అనుసంధానించిన బైజూస్ కంటెంట్ వచ్చే ఏడాది నుంచి అందించబోతున్నాం. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు 4.7 లక్షల మందికి రూ.500 కోట్లతో ట్యాబ్‌లను ఉచితంగా ఇస్తోంది. ఈ సెప్టెంబర్‌లోనే ట్యాబ్‌లను అందజేస్తున్నామని సగర్వంగా చెబుతున్నాను. ఆ ట్యాబ్ అందుబాటులోకి వస్తే బైజూస్ కంటెంట్ అందుబాటులో ఉంటుంది. యానిమేటెడ్ చిత్రాలతో సులభంగా అర్థమయ్యేలా చెబుతారు. వీరంతా కూడా పదో తరగతి పరీక్షలు రాసే పిల్లలను బైజూస్, రాష్ట్ర ప్రభుత్వం చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాయి. ఈ ట్యాబ్‌లు అందుబాటులోకి వస్తుంది. 8వ తరగతిలోకి ఎంట్రీ అయ్యే ప్రతి విద్యార్థికి నిరంతర ప్రక్రియగా విద్యాకానుకతో పాటు ట్యాబ్‌ను అందజేస్తాం.
పిల్లల జీవితాలను మార్చే కార్యక్రమంలో భాగంగా రాబోయే రోజుల్లో డిజిటల్ విధానంలో పాఠాలు బోధించేందుకు ప్రతి క్లాస్ రూంలో టీవీలు, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. మన పిల్లలు పోటీ ప్రపంచంలో నెగ్గాలి. మన పిల్లల తలరాతలు మారేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. మీ మేనమామగా ఇలాంటి పథకాలు అమలు చేస్తూ భరోసా ఇస్తున్నాను. విద్యారంగం మీద కేవలం ఈ మూడేళ్ల కాలంలో మన ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 44 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ మూడేళ్లలో రూ.19,617 కోట్లు ఖర్చు చేశాం. టీడీపీ ఐదేళ్ల పాలనలో అమ్మ ఒడి ఆలోచన కూడా చేయలేదు. జగనన్న విద్యా దీవెన ద్వారా 25 లక్షల మంది మేలు చేసేందుకు పూర్తి ఫీజు రీయింబబర్స్‌మెంట్ కింద రూ.8 వేల కోట్లు ఖర్చు చేశాం. జగనన్న వసతి దీవెన కింద రూ.3,329 కోట్లు ఖర్చు చేశాం. ఈ రెండు పథకాలతో దాదాపుగా రూ.11 వేల కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు పాలనలో అరకొరగా ఫీజులు ఇచ్చేవారు. బకాయిలు పెట్టి వెళ్తే మీ జగనన్న ప్రభుత్వం తీర్చింది.
జగనన్న విద్యా కానుక ద్వారా 47 లక్షల మంది పిల్లలకు బడి తెరిచే రోజున మంచి నాణ్యతతో కూడిన బ్యాగ్‌లు, యూనిఫాం, బైలివింగ్ టెస్ట్‌బుక్కులు, నోట్సు, బూట్లు అందజేశాం. ఇందుకు రూ.2300 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పిల్లలకు ఇలాంటి మంచి చేయాలనే ఆలోచన రాలేదు. ఏడాదికి రూ.150 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతి రోజు ఒకరకమైన భోజనంతో మెనూ రూపొందించాం. నాణ్యమైన ఆహారం ఇస్తూ రూ.3200 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు పాలనను గుర్తుకు తెచ్చుకోండి. 8 నెలల పాటు బకాయిలు, ఆయాలకు జీతాలు ఇవ్వలేదు. సరుకులకు డబ్బులు కూడా ఇవ్వలేదు. బకాయిలు పెట్టారు.
ఇవాళ పాఠశాలల్లో కనివినీ ఎరుగని విధంగా నాడు–నేడు పథకం కింద పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 15,715 స్కూళ్లలో మొదటి దఫా పూర్తి చేశాం. అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నాం. రెండో దఫా నాడు–నేడు భాగంగా 22,340 స్కూళ్లలో పనులు జరుగుతున్నాయి. ఇందుకు మరో రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.
వైయస్‌ఆర్ సంపూర్ణ పోషణకు 34,19,875 మంది చెల్లెమ్మలు, పిల్లలకు రూ.5 వేల కోట్లు మీ జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది. చంద్రబాబు హయాంలో ఈ పథకానికి రూ.500 కోట్లు కూడా ఇవ్వలేదు. ఈ మూడేళ్లలో విద్యారంగంలో అక్షరాల 52,600 కోట్లు మన ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో టీచర్ల జీతాలు ప్రస్తావించలేదు. ఈ పథకాల కోసమే ఈ డబ్బు ఖర్చు చేశాం. పేదరికం నుంచి కుటుంబాలను బయటకు తెచ్చేందుకు తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ రూ.52,600 కోట్లు ఈ మూడేళ్లలో ఖర్చు చేశాం.. ఇన్ని మంచి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి కాబట్టి ఒక్కసారి మార్పు గమనించండి. 2018–2019లో 1 నుంచి 10వ తరగతి పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో 37.21లక్షల మంది. 2021–2022కు లెక్కిస్తే అక్షరాల 44.30కు పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 7.10 లక్షల మంది పెరుగుతూ వచ్చారు. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలను కలిపితే 2022 నాటికి 2 లక్షల మంది పెరిగారు. ఇదంతా మనకళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా విద్యారంగంలోని మార్పులే కారణం. ఇటువంటి మంచి చేసే ప్రభుత్వంపై, మంచి చేసే మీ జగన్ మామయ్య మీద, మీ జగనన్న మీద విమర్శలు చేసేవారు కూడా ఎలాంటి వారో ఒక్కసారి గమనించండి.
మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రోజు యుద్ధం నేరుగా జరగడం లేదు. కుయుక్తులు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నారు. ఈ రోజు మారీచులతో యుద్ధం చేస్తున్నాం. ఒక్క చంద్రబాబు ఒక్కరితో కాదు యుద్ధం చేసేది. చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ దుష్ట చతుష్టంతో యుద్ధం చేస్తున్నాం. వీరికి మరో దత్త పుత్రుడు ఉన్నాడు. వీరందరితో ఒకే ఒక జగన్ యుద్ధం చేస్తున్నాడు. ఈ జగన్‌కు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ8 అండగా ఉండకపోవచ్చు. మీ జగన్‌కు మీ ఆశీస్సులు, దేవుడి దయ ఉన్నంత వరకు ఎంట్రుక కూడా పీకలేరు. కారణం జగన్‌కు మీరు తోడుగా ఉన్నారు కాబట్టి. ఈ దుష్ట చతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మకండి. మన ఇంట్లో మన ప్రభుత్వం ద్వారా మనకు మంచి జరిగిందా లేదా అన్నదే కొలబద్దగా తీసుకోండి. జగనన్న ద్వారా మంచి జరిగితే మద్దతు ఇవ్వండి. దేవుడి దయతో ఇంకా మంచి చేసే రోజులు రావాలని, ప్రతి పిల్లాడికి, ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని ఈ కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభిస్తున్నాను.