Connect with us

Hi, what are you looking for?

Andhra News

అల్లూరి స్ఫూర్తిని కొనసాగించాలి : ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ అని, అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని..

Share

ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ అని, అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సభా ప్రాంగణం నుంచే వర్చువల్‌ ద్వారా విగ్రహావిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోదీ.. మన్యం వీరుడికి ఘనంగా నివాళులర్పించారు.

“అల్లూరి తెలుగు జాతి యుగపురుషుడు. యావత్‌ భారతావనికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన అల్లూరి జయంతి రోజున మనందరం ఇక్కడ కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి.. వీరభూమి.. ఇలాంటి పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. యావత్‌ భారత్‌ తరఫున అల్లూరి పాదాలకు వందనం చేస్తున్నా. అల్లూరి కుటుంబంతో వేదిక పంచుకోవడం నా అదృష్టం. దేశం ఇప్పుడు 75వ స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకుంటోంది. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయింది. ఇలాంటి సమయంలో.. మన్యం వీరుడి 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా  అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, కేంద్రమంత్రి శ్రీ కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా  వేదికపై ప్రధాని  నరేంద్రమోదీని శాలువతో సత్కరించి, జ్ఞాపికను, విప్లవ వీరుని పోరాటానికి గుర్తుగా విల్లు,బాణం బహుకరించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.   ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ  నా అన్నదమ్ములకు, అవ్వాతాతలు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతిని పురస్కరించుకుని మనమంతా ఇవాళ ఏకమయ్యాం. ఒక దేశాన్ని మరో దేశం, ఒక జాతిని ఇంకో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని మన స్వాతంత్య్ర యోధులందరూ కూడా కలలు కన్నారు. ఇది వారిని స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం జరుపుకుంటున్న సంవత్సరం. మన స్వాతంత్య్రానికి ఈ ఏడాది 75సంవత్సరాలు నిండుతాయి. అంటే దానర్ధం మనల్ని మనం పాలించుకోవడం ప్రారంభమై ఇప్పటికే 75 సంవత్సరాలు అవుతుంది. మన గడ్డమీద మన పూర్వీకులు మన స్వాతంత్య్ర సమరయోధులు వారి భవిష్యత్తుని, వారి జీవితాన్ని, రక్తాన్ని ధారపోసి మన దేశానికి ఈ  స్వాతంత్య్రాన్ని ఇచ్చారు.  అలాంటి స్వాతంత్య్రం అమృతంతో సమానం. ఇది ఈ  అజాదీ కా అమృత్‌ అనే పదానికి అర్ధం. 75 ఏళ్ల క్రితం వరకు జరిగన మన దేశ స్వాతంత్య్ర సమరంలో, మన జాతీయ ఉద్యమంలో 1757 నుంచి 1947 సంవత్సరం వరకు.. అంటే దాదాపు 190 సంవత్సరాలు ఒక్కసారి తిరిగి చూస్తే.. పరాయి దేశాల, పరాయి పాలన మీద మన దేశం యుద్ధం చేస్తూనే… అడుగులు ముందుకు వేసింది.

లక్షల మంది ప్రాణత్యాగాల ఫలితం…
లక్షల మంది తమ ప్రాణాలు పణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితమే నేటి మన భారతదేశం. అటువంటి మహా త్యాగ మూర్తుల్లో మన గడ్డమీద, ఈ రాష్ట్రం మట్టి నుంచి, ఇక్కడ ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే.

మహా అగ్నికణం– అల్లూరి
అటువంటి త్యాగధనుల్లో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికణం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు అని… ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డలా సగర్వంగా తెలియజేస్తున్నాను.  అడవిలో కూడా అగ్గి పుట్టించిన ఆ యోధుడు, సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పిన  సంస్కర్త. భావాల పరంగా ఎన్నటికీ మరణం లేని ఓ విప్లవవీరుడు. ఈ 125 వ జయంతి సందర్భంగా..  ఆ అల్లూరిని స్మరించుకునేందుకు మన ప్రధామంత్రి సమక్షంలో మనమంతా ఈరోజు సమావేశమయ్యాం.

తెలుగుజాతికి, భారతదేశానికి స్ఫూర్తి ప్రదాత…
తెలుగుజాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన ఆ మహనీయుడు అడవిబిడ్డలకు ఆరాధ్యదైవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈ రోజు గొప్పగా నివాళులు అర్పిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు గారి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టే… ఆయన నడయాడిన నేల, నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టాం.

ఇక్కడ (భీమవరంలో)ఏ రకంగా విగ్రహావిష్కరణ జరుగుతుందో ఆ జిల్లాలో కూడా ఆ మహానుభావుడి కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతోంది. తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని కూడా తరతరాలకు సందేశమిచ్చేలా బతికి చిన్న వయసులోనే తన ప్రాణాలను త్యాగం చేసిన ఆ  మహామనిషిని తెలుగుజాతి ఎప్పటికీ మర్చిపోదు. దేశం కోసం అడవి బిడ్డల కోసం తనను తానే త్యాగం చేసుకున్న ఆ మహావీరుడికి నా వందనం. ఎప్పటికీ కూడా ఆ మహావీరుడు చరితార్ధుడు. అతని త్యాగం ప్రతి పాప, ప్రతి బాబు, ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిల్చిపోతుంది. అమర్‌ రహే అల్లూరి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు జైహింద్‌ అని … సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Uncategorized

Beşiktaş su kaçak tespiti Beşiktaş’ta Su Kaçağı Tespiti ve Onarımı Kameralı Su Kaçağı Tespiti ve Onarımı Beşiktaş’ta su kaçağı tespiti ve onarımı firmamız tarafından...

Lingual Support by India Fascinates