కల్తీ మద్యం తీస్తున్నది మనుషుల ప్రాణం. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం ఏరులై పారుతున్నది. ఈ మద్యం రక్కసి కరాళ నృత్యానికి అభం శుభం తెలియని బడుగు జీవులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలు మొదలుకొని మెట్రోపాలిటన్ సిటీస్ వరకు మద్యం కల్తీ మద్యం అనే మహమ్మారి. తన పంజాను విసురుతూనే ఉంది. వీటిని అడ్డుకోవలసిన పోలీసులు, నిఘా వర్గాలు పూర్తిస్థాయిలో పని చేయకపోవడం సిబ్బంది కొరత వల్ల ఎందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
మద్యం ప్రాణాంతకం
మద్యపానం సేవించే వారికి వారు తాగే స్థాయిని బట్టి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వారి శరీర ధర్మం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే మొదట్లో అవి వెంటనే ప్రభావం చూపకపోయినా మద్యం వాడకం ఎక్కువ అయ్యేకొద్దీ దాని దుష్ప్రభావాలు భవిష్యత్తులో ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తుంది. ఆల్కహాల్ అనేది ఒక సేంద్రియ సమ్మేళనం, ఇది ప్రాథమిక ఆల్కహాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ను సూచిస్తుంది. ఇది ఏదైనా మధ్యపానీయంలో ప్రధాన భాగం కాబట్టి ఆల్కహాల్ త్రాగేవారు వయస్సును బట్టి తగు మోతాదులో తీసుకోవాలి. లేదంటే మద్యం వలన అనేక రకాలైన అనారోగ్యాల భారీన పడవలసి వస్తుంది. ఆల్కహాల్ తీసుకొనే అలవాటు మార్చుకోకపోతే ఇది క్రమ క్రమంగా వ్యసనంగా మారే అలవాటు ఏర్పడుతుంది. ఆల్కహాల్ సేవించడం వల్ల బ్లడ్ ప్రెజర్ గుండె సంబంధిత వ్యాధులు మొదలైనవి పెరుగుతాయి. ఇవన్నీ కూడా మధ్య వయసు నుంచే మొదలవుతున్నాయి మద్యపానం వల్ల ఎన్నో శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అల్సర్ రావచ్చు కొందరికి. ఈ అల్సర్ నుంచి రక్తస్రావం కూడా జరగవచ్చు. ఈ అల్సర్ తీవ్ర స్థాయికి చేరితే కడుపులో రంధ్రాలు పడి ప్రాణాపాయం సంభవించవచ్చు. మద్యపానం వల్ల నోటి క్యాన్సర్. అన్నవాహిక క్యాన్సర్, గొంతు క్యాన్సర్ , నాలుక క్యాన్సర్. పాంక్రియాస్ కేన్సర్,లివర్ కేన్సర్ రావచ్చు. మద్యం సేవించడం వల్ల కాలేయానికి సంబంధించిన వ్యాధులే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యల ను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. తాగుడు వల్ల ఆరోగ్య సమస్య లే కాక ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తాది .తాగుడుకు అలవాటు పడిన వారి పని సామర్థ్యం తగ్గిపోతుంది. వారు పనికి తరచూ గైర్హాజరవుతారు. అనారోగ్యానికి గురవుతారు ఈ కారణాల వల్ల ఉత్పత్తి పడిపోతుంది. తాగుడు నిరుద్యోగానికి దారితీస్తుంది. అకాల మరణం కూడా సంభవించవచ్చు .మద్యపానం అలవాటుగా మారకముందే దాని వల్ల కలిగే ముప్పును గ్రహించాలి.
మద్య నిషేధం పై పిటిషన్
దేశవ్యాప్తంగా మధ్య నిషేధం అమలకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదాయాన్ని మాత్రమే పట్టించుకుంటూ రాజ్యాంగ బాధ్యతను విస్మరిస్తుందని 1995 నాటి ఆంధ్రప్రదేశ్ ప్రోహిబిషన్ చట్టానికి సవరణలు తీసుకుని వస్తూ 1997లో చేసిన చట్టాన్ని రద్దు చేయాలంటూ నిజామాబాద్ కు చెందిన ఎం.నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 1995లో మహిళలు ఉద్యమించడంతో మద్యపానం మీద నిషేధం విధించారు. అనంతరం సడలించారు. నిషేధం కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో సడలించామన్నారు. నియంత్రణను చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు మద్యం వినియోగం వల్ల భంగం వాటిల్లుతున్నది. మద్యం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. వాహనదారులు హెల్మెట్ ధరించే విషయాన్ని ప్రజల ఇష్ట ఇష్టాలకు వదిలిపెట్టకుండా ప్రభుత్వం చర్యలు ఎలాగైతే తీసుకుంటుందో అలాగే మధ్య నిషేధంలో కూడా చర్యలు కఠినంగా తీసుకోవాలి మద్యంతో సంపాదించే లాభాలు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో సొమ్ము సంపాదించి పెట్టవచ్చును కానీ సమాజాన్ని నష్టపరుస్తాయి ఉత్పాదకతను దెబ్బతీస్తాయి ఎంతో విలువైన మానవ వనరులను బలహీన పరుస్తాయి. కష్టజీవుల శ్రమ ఫలితంలో అత్యధిక మొత్తాన్ని అపహరించి జాతికి తీరని అపకారం చేస్తుంది. సంపూర్ణ మధ్య నిషేధం వల్ల తాగుబోతుల కారణంగా… జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు. స్త్రీలపై అత్యాచారాలు ఇతర నేరాలు తగ్గిపోతాయి.
నిబంధనలు
పాఠశాల, దేవాలయం, ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలోపుగా దుకాణాలు ఏర్పాటు చేయకూడదు. పాఠశాల గుర్తింపు పొందినదై ఉండాలి . అలాగే దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలోనిదై ఉండాల్సి ఉంటుంది .30 పడకల ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలోపు మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయకూడదు. దుకాణం ఏర్పాటు నిర్దేశించిన స్థలం మేరకే ఉండాలి. దుకాణంతో పాటు ప్రత్యేక గదులు వార్ స్థాయి ఏర్పాట్లు చేయకూడదు. దుకాణం అమ్మకం స్థానం మాత్రమే కొన్నచోటే తాగడానికి ఏర్పాట్లు చేయడం నిషిద్ధం. మద్యం వ్యాపారులు లిక్కరు, బీరు, ఇతర మద్యాన్ని బాటిల్ పై వేసిన ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి. విక్రయాలు ఉదయం 10:30 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే జరపాలి. అంతకుమించి సమయాన్ని దాటి అమ్మకాన్ని జరిపిన వారికి జరిమానా విధిస్తారు. బార్లు అయితే రాత్రి 12 గంటల వరకు తెరిచే వెసులుబాటు ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం..కరాళ నృత్యం : బీఎస్పీ ఖండన
ఆంధ్రప్రదేశ్ లో మార్చ్ లో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం సేవించి 29 మంది మరణించడం విషాదకరమని నెల్లూరులో, విశాఖ ఏజెన్సీలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని దీనివలన సామాన్య ప్రజలు బలహీన వర్గాలు దళితులు ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనిపై పోరాడడానికి బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, బహుజన సమాజ్వాది పార్టీ చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షుడు పూరిముట్ల బాబు తెలిపారు .ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కల్తీ మద్యంపై దృష్టి పెట్టి పేదవారిని కాపాడాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.