సామాజిక న్యాయభేరి పేరుతో వైసీపీ మంత్రులు ప్రభుత్వ ప్రతినిధులు అధికారులు బస్సు యాత్ర చేస్తూ ప్రభుత్వ పథకాలు, వాటి అమలు గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తామని చెప్పడం హాస్యాస్పదం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వ పథకాల అమలు గురించి ప్రత్యేకంగా ప్రజలకి వివరించాల్సిన అవసరం కంటే పథకాల అమలులో ఉన్న లోపాలు ప్రజలు పడుతున్న కష్టాల గురించి బస్సుయాత్ర చేస్తే క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటో ప్రజాప్రతినిధులకి అర్ధమవుతుంది. అది వదిలేసి జగన్ రెడ్డి ప్రభుత్వ గొప్పలు గురించి బాకా ఊదటానికే మంత్రులు ఈ యాత్ర చేస్తున్నారా ? అన్నట్టు ఉంది పరిస్థితి. వాస్తవానికి సామజిక పునాదులను పటిష్ఠపరచటం తప్పేం కాదు. వెనకబడిన కులాలకు ఆర్థిక స్వాలంబన కల్పించటం అత్యవసరం ఐతే దానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బట్టి వారి నిబద్ధతను కొలవాల్సిన పరిస్థితి ఉంటుంది.
రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారానికి రావటానికి వేసిన ప్రజా పునాదిలో వెనుకబడిన తరగతుల వారు కీలక పాత్ర పోషించారు. జగన్ రెడ్డి ఎన్నికల మానిఫెస్టోలో కూడా వెనకబడిన తరగతులు షెడ్యూల్ కులాలు తరగతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని దానికి అనుగుణంగానే నవరత్నాల రూపకల్పన జరిగిందని చెప్పారు. వాస్తవానికి నవరత్నాల సంక్షేమం మాటున వారిని కేవలం సంక్షేమ లబ్దిదారుల్లా ఉంచాలనే కుట్ర దాగుందని విషయాన్నీ మర్చిపోకూడదు జనాభాలో సగం వెనుకబడిన తరగతుల వారు ఉన్నప్పుడు సగం పదవులు వారికి కూడా కేటాయించాలి కానీ అలా కాకుండా మొత్తం శాసనసభ స్థానాలలో వారికీ కేటాయించింది ఎంత ?వారికీ ఇచ్చిన పదవులు ఎన్ని అదేమంటే గత ప్రభుత్వాలు చేయలేదు మేమే బీసీలకు అంతా చేస్తున్నాం అని చెప్తున్నప్పుడు చేస్తున్న పనులు కూడా లెక్కలకి సరిపోతే హర్షించదగిన విషయం ఆలా కాకుండా కేవలం వోట్ బ్యాంకు రాజకీయాలకోసం బీసీ సంక్షేమవడాన్ని తలకెత్తుకున్నట్టు ఉంటుంది తప్ప నిజమైన ప్రేమ వారి పట్ల కనపడదు.
ఎవరికి ఎన్ని సీట్లు ?
2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి వాస్తవానికి 175 స్థానాలకుగాను మొత్తం వెనకబడిన కులాలకు ఇచ్చిన సీట్లు 41 అందులో వైసీపీ నుండి గెలిచింది కేవలం 28 టీడీపీ నుండి 6గురు మొత్తంగా 34 మంది అదే రాష్ట్రములో అన్ని కులాల పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం.. అందులో ప్రదానంగా అధిపత్యకులాల పరిస్థితి ఏంటో చూద్దాం .. రాష్ట్రము లో ఉన్న శాసన సభ స్థానాలకు రెడ్డి కులం వైసీపీ నుండి మొత్తం 48 ఎన్నికయ్యారు. అదేవిధంగా టీడీపీ, జనసేన నుంచి ఎవరు ఆ కులం నుండి ఎన్నిక కబడలేదు. కమ్మ కులం నుండి వైసీపీ తరపున 6 గురు టీడీపీ నుండి 11 మొత్తం 17 మంది కమ్మ కులస్తులు అసెంబ్లీలో ఉన్నారు. కాపులు వైసీపీ నుండి 22 మంది తెలుగుదేశం నుండి ముగ్గురు మొత్తంగా 25మంది మాత్రమే అసెంబ్లీ లో ఉన్నారు షెడ్యూల్ కులాల నుండి 27 మంది వైసీపీ తరపున ఎన్నికైతే కేవలం ఒక్కరు మాత్రమే టీడీపీ నుండి ఎన్నికయ్యారు. ఎస్టీ సామజిక వర్గం నుండి వైసీపీ తరపున 7 మంది టీడీపీ జనసేన నుండి ఎవరు లేకపోవటం తో మొత్తంగా ఎస్టీ లు 7 గురు అసెంబ్లీ లో ఉన్నారు క్షత్రియ వైసీపీ నుండి ముగ్గురు టీడీపీ నుండి ఒక్కరు ఎన్నికఅయ్యి మొత్తం నలుగురు అసెంబ్లీ లో ఉన్నారు వైశ్య కులానికి వైసీపీ నుండి ముగ్గురు టీడీపీ నుండి ఒక్కరు ఎన్నికయ్యి మొత్తంగా 4 గురు వైశ్య కులస్తులు అసీంబ్లీ లో ఉన్నారు బ్రాహ్మణ సామజిక వర్గం నుండి వైసీపీ తరపున ఇద్దరు ఎన్నిక అయ్యారు ఇతర పార్టీల నుండి ఎవరు ఎన్నుకోబడలేదు మొత్తం గా ఇద్దరు అసెంబ్లీ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు వెలమ సామజిక వర్గం నుండి 1 ముస్లిం సామజిక వర్గం నుండి నలుగురు మొత్తం వైసీపీ నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బీసీల్లో 2019 లో ఎవరు జగన్ రెడ్డి వెంట నడిచారు ?
బీసీ కులాల్లో ప్రదానం గా శ్రీకాకుళం నుండి చుస్తే పోలినాటి వెలమ కొప్పు వెలమ, కళింగ తూర్పుకాపులు యాదవులు మొత్తంగా వైసీపీ వెంట నడిచారు . అదేవిధంగా గౌడాస్, కురుబ లింగాయత్ లు వైసీపీ వెంట నడిచారు. అధిపత్యకులాల్లో బ్రాహ్మణ, క్షత్రియ , వెలమ, వైశ్యులు వైసీపీతో ఉన్నారు. మరి బీసీ కులాలు ఇంత పెద్ద ఎత్తున జగన్ రెడ్డి వెంట నడచినపుడు జనాభాలో సగ భాగంగా ఉన్న బీసీలకు నిజంగా దక్కిన వాటా కేవలం 28 సీట్లు. రాష్ట్ర జనాభాలో మొత్తం ఆరు శాతం కూడా లేని రెడ్డి కులం వారు 48 మంది ఎలా ఎన్నికయ్యారు ఇది జనాలకు చెప్పే దైర్యం ఉంటే అప్పుడు సామజిక న్యాయ భేరి అని మోగించండి అప్పుడు చెప్తారు. జనాలు ఇది సామజిక విప్లవమా లేక దోపిడీని అనేది.
ఎన్నికల నియంతృత్వం..
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగే పద్దతి పోయి ఎన్నికల నియంతృత్వానికి రాజకీయనాయకులు తెరలేపారు. కేవలం ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు అని ఊదరగొట్టడం ఎన్నికలు జరుగుతున్నంత సేపు ప్రలోభాలకు గురిచేసి ఓట్లు రాబట్టి ఎన్నికలు ముగిసాక ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసే నియంతృత్వ ధోరణిని ని వైసీపీ ప్రభుత్వం వదిలి కాకమ్మ లెక్కలు కాకుండా ప్రజలకు నిజాన్ని తెలపాలని ఈ సామజిక న్యాయభేరి ప్రజల లోటు పాట్లు తెలుసుకునే విధంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా నవరత్నాల పేరుతో దోపిడీ మాని ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటు పడాలని ప్రజలు కోరుకుంటున్నారు ..