వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించిన “సామాజిక న్యాయ భేరి బస్సు యా త్రలో రాష్ట్ర మహిళా మంత్రులు తానేటి వనిత, ఉషాశ్రీ చరణ్, విడుదల రజిని, మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నుంచి మొదలైన బస్సు యాత్రలో మహిళా మంత్రులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు, నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే సామాజిక భేరి బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ గారి కేబినెట్ లోని మొత్తం 25 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు పాల్గొంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యాపరంగా సామాజిక న్యాయం జరుగుతుందని, దేశానికే ఇది మార్గదర్శకంగా నిలుస్తోందని మహిళా మంత్రులు పేర్కొన్నారు.