జగన్ పాలనకు మూడేళ్లు నిండుతున్నాయి. ఈ నెల 30వ తేదీతో ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడేళ్లు అవుతుంది. జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైసీపీకి 151 అసెంబ్లీ, 23 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. టీడీపీ 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాలుగు దశాబ్దాల్లో టీడీపీకి పరాభావం మాయని మచ్చగా మిగిలింది. వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా జగన్ తలపెట్టిన సంకల్ప యాత్ర ప్రధాన భూమిక పోషించిందనే చెప్పాలి. దీంతో అధికారం జగన్ కు వరమైంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నందుకు జనాలు ఆమోదించి అవకాశం ఇచ్చారు. జగన్ సంక్షేమ పాలనను అందించారు.
ముఖ్యమంత్రిగా జగన్ 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ అధినేతగా 8 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఐదేళ్లు నిత్యం ప్రజల సమస్యలే ప్రధానంగా పోరాటం సాగించారు. ప్రజలను నమ్ముకున్న నేతగా జగన్ ను ప్రజలు ఆదరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో జగన్ ముందుకు వెళ్తున్నారు. జగన్ పాలనలో లోపాలున్నా అభివృద్ధి ఎజెండాగా ముందుకు కదులుతున్నారు. మూడేళ్లలో అప్పలుు తెచ్చి ప్రజలకు పంచారు. ప్రజలపై పన్నులు బాదాడు.. వ్యతిరేకించిన వారిపై కక్ష సాధింపులు జరిగాయి.. మొత్తానికి ఎలాగోలా ఎన్నో వివాదాలు.. సంక్షేమ ఫలాలతో జగన్ మూడేళ్ల పాలన సాగింది.
నేటితో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా సంబరాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాల నిర్వహణకు వైసీపీ ఆదేశాలు జారీ చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయసాయిరెడ్డి కేక్ కట్ చేశారు. ఈ వేడుకలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా ప.గో.జిల్లా ఉపముఖ్యమంత్రి తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు జరుపుకున్నారు. స్థానిక పోలీస్ ఐ-ల్యాండ్ వద్ద దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం కేక్ కట్ చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు.