లంక గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసిన రామచంద్ర యాదవ్
గోదావరి వరద ప్రాంతాల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్, టీం సభ్యలతో కలిసి పర్యటించారు. గోదావరి వరద ముంపుకు గురైన లంక గ్రామాలు, పునరావాస కేంద్రాలకు, ముంపు ప్రాంతాలకు వెళ్లి బాధితులకు భోజనాలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు.
గోదావరి వరద ముంపుకు గురైన లంక గ్రామాల ప్రజలు నిత్యావసర సరుకులు, ఆహారం లేక ఆకలితో అల్లాడుతున్నారని వారిని ప్రభుత్వం అదుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు.. ఈ నేపథ్యంలో RCY టీం సభ్యులతో కలిసి గోదావరి వరద ముంపుకు గురైన లంక గ్రామాలు సందర్శించారు… తన సోంత నిధులతో లంక గ్రామా ప్రజలకు నిత్యావసర సరుకులు, ఆహారం అందజేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పునరావాస శిబిరాల్లో ఉన్న బాధితులకు అరకొర ఆహారం సరఫరా చేస్తున్నారు. లంక గ్రామాల బాధితులు శిబిరాలకు వెళ్లడం లేదు. ఎందుకంటే పునరావాస కేంద్రాలకు వెళితే ఉన్న వస్తువులు కూడా మళ్లీ వరదకు కొట్టుకు పోతాయని భయంతో చాలా మంది ఇళ్ల మధ్యే ఉండిపోయారు. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి ఆహారం, తాగునీరు అందడం లేదు. దీంతో కోనసీమ వాసులు ఆకలితో అల్లాడుతున్నారు. వారానికి ఒకసారి అధికారులు పంపిణీ చేసే ఆహార పొట్లాల కోసం బాధితులు కొట్లాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు… ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గోదావరి వరద ముంపుకు గురైన లంక గ్రామాలు ప్రజలను అదుకోవాలని డిమాండ్ చేశారు… ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్, MPTC, అంబేద్కర్ కోనసీమ జిల్లా RCY టీం సభ్యులు ఉన్నారు.