తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న2 రాజ్యసభ స్థానాలకు మే 24, మంగళవారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ మే 24 నుంచే ప్రారంభమవగా, నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు మే 31గా నిర్ణయించారు. ముందుగా ఈ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో అధిపతి డాక్టర్ పార్థసారథి రెడ్డి పేర్లను టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. దీంతో బుధవారం టీఆర్‌ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి రాజ్యసభకు తమ నామినేషన్లు దాఖలు చేశారు.
రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.