గంగూలీ ట్విట్టర్ ఖాతాలో బుధవారం సాయంత్రం ఓ ఆసక్తికర ట్వీట్‌ను పోస్ట్ చేశారు.క్రికెట్‌లోకి అడుగుపెట్టి 30 ఏళ్లు అయ్యిందని పేర్కొంటూ, ఈ సుదీర్ఘ కెరీర్‌లో తనకు మద్దతుగా నిలిచిన వారికి గంగూలీ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా మరింత మంది ప్రజలకు సేవ చేసే దిశగా త్వరలోనే ఓ కొత్త నిర్ణయం తీసుకోబోతున్నానని కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో త్వరలోనే బీసీసీఐ చీఫ్ పదవికి రాజీనామా చేయనున్న గంగూలీ… ఆ వెంటనే బీజేపీలో చేరతారంటూ పుకార్లు జోరందుకున్నాయి.
నెల వ్యవధిలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో రెండు పర్యాయాలు భేటీ అయ్యారు. ఇలా అమిత్ షాతో రెండు సార్లు భేటీ కావడం, తాజాగా మరింత మంది ప్రజలకు సేవ చేసే దిశగా కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నానని స్వయంగా గంగూలీనే ప్రకటించిన నేపథ్యంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.