ఇప్పుడు స్టార్ హీరోలంతా ఎవరి సినిమాలతో వారు బిజీ బిజీగా ఉన్నారు.రాం చరణ్ , మహేశ్ బాబు,ఎన్టీఆర్ లు తీసిన సినిమాల విజయం అనంతరం ఎవరి పనుల్లో వాళ్ళు దిగిపొయ్యారు. వీళ్లు చేస్తున్న సినిమాలపై రకరకాల ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
చరణ్ తాజా చిత్రం శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. అందువలన ఈ సినిమాకి ‘అధికారి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.
ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు త్వరలో మొదలుకానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాకి ‘అర్జునుడు’ అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
ఇక ఎన్టీఆర్ తన 30వ సినిమా కోసం కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. 31వ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాకి టైటిల్ గా ‘అసురుడు’ అనుకుంటున్నారు. మాస్ యాక్షన్ జోనర్లో ఈ కథ నడుస్తుందనే సమాచారం.
అసలు విశేషం ఏమిటంటే….ఈ ముగ్గురు హీరోల సినిమాల టైటిల్స్ ‘అ’ అనే అక్షరంతో మొదలవుతూ ఉండటం.ఇది ఎంతవరకు నిజమో వేచిచూడాల్సిందే….