వైద్యం కోసం క్యూకడుతున్నారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి బాలింతలు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్దికి ప్రభుత్వం కోట్ల రూపాయలు వైద్య సదుపాయాలకు కేటాయిస్తున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. దీంతో ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందుతున్న పేదలు నిత్యం అగచాట్లకు గురవుతున్నారు. పాలకులు, అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా బాలింతలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న వైనం కంటికి కనిపిస్తున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో బాలింతలకు సరైన బెడ్లు లేక అవస్థలు పడుతున్నారు. ఒకే పడకపై ఇద్దరు బాలింతలను పడుకోబెట్టారు. అయినా దీన్ని అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి ఖరీదు ఆయన వైద్యం పొందలేక ప్రభుత్వ దవాఖానాలో మెరుగైన వైద్యం ఉచితంగా అందుతుందనే నమ్మకంతో ఉన్న వారికి సరైన సదుపాయాలు కనిపించకపోవడంతో ఏమి చేయాలో తెలియక రోగులు, వారి కుటుంబసభ్యులు అనేక అవస్థలు పడుతున్నారు. అదేంటని ప్రశ్నిస్తే వైద్యులతో పాటు వైద్య సిబ్బంది బాలింతలు, రోగులు, రోగులు బంధువులపై భౌతిక దాడులకు దిగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో పడకల కొరత సమస్యలు పరిష్కరించాలని పేషెంట్లు కోరుతున్నారు.
2 నెలలుగా థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ కి కిట్లు లేవు
రెండు 2 నెలలుగా థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ కి కిట్లు లేవని ఆస్పత్రి సిబ్బంది బ్లడ్ పరీక్ష చేసే డాక్టర్స్ అన్నారు వారిని అడగగా నెల క్రితమే మీరు ఆర్డర్ పెట్టాము స్టాప్ కి ఇంతవరకు స్టాకు రాలేదు అని సిబ్బంది, డాక్టర్లు అన్నారు. మమల్ని ఎం చేయమంటారు బయట చేయించుకోండి అని డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ అలాగే మెడిసిన్స్ కూడా కొన్ని లేవని కనీసం ఇచ్చే మెడిసిన్స్ కూడా లేకపోతే ఎలాగ జనరల్ మెడిసిన్స్ కూడా ఇవ్వట్లేదు. ప్రజలు ఈ ఒక్క థైరాయిడ్ పరీక్షకి ఇబ్బంది పడుతున్నామని బయటికెళ్తే 400 నుంచి1000 రూపాయలు అమౌంట్ ఖర్చవుతుందని చెప్తున్నారు.
తెలుగు మహిళ ఆధ్వర్యంలో పాత గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శన
విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి ఆధ్వర్యంలో పేషేంట్ల సదుపాయాల పర్యవేక్షణలో భాగంగా వెళ్లారు. మాతా శిశు సంక్షేమ విభాగంలో బెడ్లు సరిగా లేక బాలింతలు, పసిపిల్లల ఇబ్బంది పడుతున్న వైనాన్ని పర్యవేక్షించారు. ఆపరేషన్ చేసిన ఇద్దరి బాలింతలను ఒకే బెడ్ పై పడుకోబెట్టడాన్ని గమనించారు. సెలైన్ పెట్టుకున్న బాలికను ఖాళీ లేక బెడ్ పక్కన కింద పడుకోబెట్టారు. ఆసుపత్రిలో సదుపాయాలు లేక రోగులు అవస్థలు పడుతుంటే పాలన అంతా బాగుంది అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం సరికాదన్నారు. తక్షణమే ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.