ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో “సలార్” మూవీని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం భారీ బ్యానర్ పై రిలీజ్ అవుతోంది. కెజిఫ్, కెజిఫ్ 2 చిత్రంతో రికార్డులు బద్దలుకొట్టిన ప్రశాంత్ నీల్ సలార్ పై అమాంతం అంచనాలు పెంచేశారు. ఇప్పుడు ప్రేక్షకులను మళ్ళీ మెస్మోరైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి యాక్షన్ ఎపిసోడ్స్ ని ఒక రేంజ్లో డిజైన్ చేయించినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా స్టార్ట్ ఐన దగ్గర నుంచి ఒక సీన్ కి మించి మరో సీన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం చాలా స్పీడ్ గా మొదలైనప్పటికీ అంతే ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకోలేకపోయింది..
ప్రభాస్ వేరే మూవీస్ షూటింగ్ లో ఉంది చాలా లేట్ ఐపోయింది. దీని కారణంగా ఇంతవరకు 35 శాతం మాత్రమే చిత్రీకరణ జరుపుకుంది. అందుకే ఈ మూవీ షూటింగ్ ఆగకుండా వరుస షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ షూటింగ్ కోసం ప్రభాస్ అప్ డేట్స్ ఇప్పటికే తీసుకున్నారు. ఈ మూవీకి రవి బాస్రుర్ సంగీతాన్ని అందించారు. ప్రభాస్ సలార్ మూవీతో ఇండియా బాక్సాఫీస్ ని బద్దలుకొట్టేస్తాడని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. సలార్ ఒక యాక్షన్ మూవీ, పైగా బెస్ట్ డైరెక్టర్ గా పేరు పడిన ప్రశాంత్ నీల్. వీళ్లిద్దరి కంబినేషన్లో వస్తున్నా ఈ బ్లాక్ బస్టర్ మూవీలో అంతా యాక్షన్ సీన్స్ మాత్రమే ఉంటాయి. అంతేకాదు, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ డైరెక్షన్లో “ఆదిపురుష్” అనే మూవీ కూడా రెడీ అయ్యింది. ఈ మూవీ తో పాటు మారుతి డైరెక్షన్ లో కూడా ఒక మూవీ కి ఓకే చెప్పడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు.