హీరో విక్రమ్ గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన హీరో విక్రమ్. విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా వైద్యుల నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ ఎలాంటి అరోగ్య సమస్యలు లేని విక్రమ్‌కి హార్ట్ ఎటాక్ ఏమిటి అనే వార్త ఇప్పుడు కోలీవుడ్ నాట ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈనేపథ్యంలో విక్రమ్‌కి గుండెపోటు అనే వార్త అందిరిని కలవరానికి గురి చేస్తుంది. అయితే అందుతున్న సమాచారం మేరకు విక్రమ్‌కి మైల్డ్ గానే పెయిన్ వచ్చిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. విలక్షణ నటకు మారు పేరు విక్రమ్. ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళంతోపాటు సౌత్ ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన `పొన్నియిన్ సెల్వన్`, `కోబ్రా` చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు విడుదలుక సిద్ధమవుతున్నాయి. మణిరత్నం రూపొందిస్తున్న `పొన్నియిన్ సెల్వన్-1` మూవీ టీజర్ ఈ రోజు సాయంత్రం విడుదల కానుంది.
