కోనసీమ జిల్లా జైభీమ్ భారత్ పార్టీ అధ్వర్యంలో జాన్ 2 నిర్వహించబోతున్న శాంతి ర్యాలీకి పోలీసులు ఇబ్బందులు గురిచేయడం తగదు అని జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ సూచించారు. శాంతి ర్యాలీకి పోలీసు వారు పెడుతున్న ఇబ్బందులను వివరిస్తూ కోనసీనుకు అంబేడ్కర్ పేరు పెట్టడంలో గల ఔచిత్యం, ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ 1944 లో ఆప్రాంతాన్ని సందర్శించినప్పుడు కులమత, వర్గ ప్రాంతాలకతీతంగా బాబాసాహెబ్ గార్ని అమలాపురం ప్రాంతం వారంతా ఘనంగా సన్మానించారని, వారు నడయాడిన ప్రాంతానికి అంబేద్కర్ పేరు పెట్టిన ప్రభుత్వాన్ని అభినందిస్తూ తదుపరి రేగిన అల్లర్లు సబబు కాదని శాంతి సమాధానాలు సమాజంలో నెలకొనాలని శాంతి ర్యాలీ జరుపతలపెట్టామని వివరి్చారు. పోలీసు వారి చర్యలు పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా వున్నాయన్నారు.
ప్రభుత్వం ఒక మంచి పని చేసిందని అభినందిస్తూ, తదుపరి జరిగిన అల్లర్లే బాబాసాహెబ్ ఔన్నత్యానికి అగౌరవం ఆపాదించేలా వున్నాయి కాబట్టి శాంతిర్వాతి ద్వారా ప్రజలు ప్రభుత్వానికి సహకరించి, ఈ రాష్ట్రంలో శాంతి – సమాధానం, ఐక్యతలతో ప్రజలందరూ స్నేహ భావంతో సంచరించే విధంగా మసలు కోవాలని తెలిపే సంకేతమే ఈ శ్వాంతి ర్యాలీ అని, ఈ సందేశం ప్రజలు అందరూ తెలుసుకోవాలని కోరారు. ర్యాలీకి పోలీసు వారు కూడా సహకరించి ఎట్టి ఇబ్బందులు కల్పించవద్దని కోరారు. సమాజ హితం కోసం, శాంతి భద్రతల రక్షణలో పోలీసు వారికి సహకరించడమే ఈ శాంతి ర్యాలీయొక్క సందేశమని తెలుపుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయమని పిలుపునిచ్చారు..