ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. కొత్త పార్లమెంట్ భవనంపై అశోక స్థంభాన్ని ఆవిష్కరించారు. నిర్మాణపనుల్లో నిమగ్నమైన ఇంజినీర్లతో పాటు కార్మికులతో ప్రధాని ముచ్చటించారు. కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు ఎంపీలు పాల్గొన్నారు. స్వతంత్ర భారతావని 75 వసంతాలు పూర్తి చేసుకున్నప్పటి నుంచి ఈ నూతన భవనంలో పార్లమెంటు ఉభయ సభల సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022తో 75 సంవత్సరాలు పూర్తవుతాయి.
టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మిస్తోంది. దీనికి హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూపకల్పన చేసింది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం కోసం రూ.971 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
ఈ భవనానికి ఆరు ప్రవేశ మార్గాలు ఉంటాయి.
1. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి; 2. లోక్‌సభ సభాపతి, రాజ్యసభ చైర్‌పర్సన్, ఎంపీలు; 3. సాధారణ ప్రవేశ మార్గం, 4. ఎంపీల కోసం మరొక ప్రవేశ మార్గం, 5,6. పబ్లిక్ ఎంట్రన్స్‌లుగా నిర్ణయించారు.
ఈ భవనాన్ని నాలుగు అంతస్థులతో నిర్మిస్తున్నారు.లోయర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్, మొదటి, రెండో అంతస్థులు ఉంటాయి. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. లోక్‌సభ ఛాంబర్‌లో 888 సీట్లు ఉంటాయి. దీని మొత్తం వైశాల్యం 3,015 చదరపు మీటర్లు. రాజ్యసభ చాంబర్లో 384 సీట్లు ఉంటాయి. దీని వైశాల్యం 3,220 చదరపు మీటర్లు. భూకంపాలను తట్టుకునే విధంగా ఈ నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ నూతన భవనంలో 120 కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. కమిటీ సమావేశ మందిరాలు, పార్లమెంటరీ వ్యవహారాల ప్రధాన కార్యాలయాలు, లోక్‌సభ సచివాలయం, రాజ్యసభ సచివాలయం, ప్రధాన మంత్రి కార్యాలయం, కొందరు ఎంపీల కార్యాలయాలు, సిబ్బంది, భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక గదులు ఉంటాయి.
ఫర్నిచర్‌లోనే స్మార్ట్ డిస్‌ప్లేస్ సదుపాయాలు ఉంటాయి. ఒక భాష నుంచి మరొక భాషకు అనువదిండానికి డిజిటల్ సదుపాయాలు ఉంటాయి. ప్రోగ్రామబుల్ మైక్రోపోన్స్, రికార్డింగ్ సదుపాయాలు ఉంటాయి. సులువుగా ఓటు వేయడానికి వీలుగా బయోమెట్రిక్స్ ఉంటాయి. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, దేశీయ వాస్తు రీతుల్లో దీనిని నిర్మిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాస్తు రీతులు దీనిలో చూడవచ్చు. సాంస్కృతిక వైవిద్ధ్యం కూడా కనిపిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులు ఈ నిర్మాణంలో పాలుపంచుకుంటారు.
ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని పురావస్తు సంపదగా పరిరక్షిస్తారు. 93 ఏళ్ళనాటి ప్రస్తుత పార్లమెంటు భవనానికి బదులుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.
This morning, I had the honour of unveiling the National Emblem cast on the roof of the new Parliament. pic.twitter.com/T49dOLRRg1
— Narendra Modi (@narendramodi) July 11, 2022
కొత్త పార్లమెంట్ భవనం- నాలుగు సింహాల చిహ్నం
దేశంలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా పార్లమెంట్ భవనంపై అశోక స్థంభాన్ని(నాలుగు సింహాలతో) ఆవిష్కరించారు. కాగా, జాతీయ చిహాన్ని కాంస్యంతో తయారు చేశారు. 9,500 కిలోల బరువు, 6.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ కార్యక్రమంలో మోదీతో పాటుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.