తెరపైకి నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు – సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కరోనా బారినపడ్డారు. ఆమె తల్లి సోనియా గాంధీకి కరోనా నిర్ధారణైన సంగతి తెలిసిందే. కాగా, మరుసటి రోజే ప్రియాంక పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో తెలిపిన ప్రియాంక.. స్వల్ప లక్షణాలున్నట్లు వెల్లడించారు. ప్రొటోకాల్‌ను అనుసరించి.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలిపారు. ఇటీవల తనకు సన్నిహితంగా మెలిగిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే, నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈ నెల 8న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట సోనియా గాంధీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఇంతలో కరోనా బారినపడ్డారు.
Priyanka Gandhi Vadra @priyankagandhi
I’ve tested positive for COVID-19 with mild symptoms. Following all the protocols, I have quarantined myself at home.
I would request those who came in contact with me to take all necessary precautions.
పాత కేసును తెరపైకి (ఈడీ) నోటీసులు జారీ
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. నూతనంగా జారీ చేసిన సమన్ల ప్రకారం.. జూన్ 13-14 తేదీలలో విచారణకు హాజరు కావాలని ED ఆదేశించింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్‌గాంధీకి ఈడీ రెండోసారి సమన్లు..
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి ఈడీ రెండోసారి సమన్లు జారీ చేసింది. గతంలో ఈ నెల 2న హాజరుకావాలని రాహుల్ ను ఆదేశించిన విషయం తెలిసిందే.. అయితే.. తాను విదేశీ పర్యటనలో ఉన్నట్లు విచారణ తేదీని వాయిదా వేయాలని దర్యాప్తు సంస్థకు ఆయన లేఖ రాశారు. ఈ నేపథ్యంలో విచారణ తేదీని వాయిదా వేసింది. కాగా, రాహుల్ జూన్ 5న స్వదేశానికి తిరిగి రానున్నారు ఈడీ విచారణకు రాహుల్ హాజరుకాకపోవడంతో జూన్ 13న రావాలని తాజాగా నోటీసు ఇచ్చింది. అంతకుముందు ప్రస్తుతం తాను ఇండియాలో లేనని ఈనెల 2వ తేదీన రాలేనని ఈడీకి రాహుల్ తెలిపారు. విచారణకు మరింత సమయం కావాలని కోరారు. రాహుల్ గాంధీ అభ్యర్థనను స్వీకరించిన ఈడీ అధికారులు.. ఈనెల 13న విచారణకు హాజరుకావాలని సమన్లు పంపింది.
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ భూకబ్జాలతో వేల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో నేషనల్ హెరాల్డ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. రాహుల్ డైరెక్టర్‌గా ఉన్న యంగ్ ఇండియా సంస్థ ద్వారా ఏజేఎల్ అనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని గాంధీలు కొనుగోలు చేశారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులోనే ఈడీ విచారణకు హాజరు కావాల్సిన సోనియాగాంధీ కరోనా బారిన పడ్డారు. అయితే ఈనెల 8న సోనియాగాంధీ ఈడీ విచారణకు కచ్చితంగా హాజరవుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద సోనియా, రాహుల్ వాంగ్మూలాలను రికార్డు చేస్తామని ఈడీ అధికారులు తెలిపారు. సోనియాగాంధీకి రాహుల్ కి నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో మనీలాండరింగ్ జరిగింది అని ED విచారణకు హాజరు కమ్మని నోటీస్ లు ఇవ్వడంతో రాజకీయ దుమారం చెలరేగింది.
అసలు నేషనల్ హెరాల్డ్ కధ ఏమిటో ఒక లుక్కేయండి …
*అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) అంటే నేషనల్ హెరాల్డ్ పేపర్ కంపెనీకి 2000 కోట్లు వరకు ఆస్తులు ఉన్నాయి. 1937లలో నెహ్రూ మరో 5000 మంది స్వాతంత్ర సమరయోధులు వాటాదారులుగా కలసి స్వాతంత్ర పోరాటంలో ఉపయోగపడుతుందని నేషనల్ హెరాల్డ్ పేపర్ కోసం ఈ AJL కంపెనీ ప్రారంభించారు. దేశానికి స్వతంత్రం వచ్చాక ఈ AJL కంపెనీ ఒక్క పేపర్స్ మాత్రమే పబ్లిష్ చెయ్యాలి ఇంకేం వ్యాపారం చెయ్యకూడదు వంటి పలు నిబంధనలతో భవనాలు నిర్మించుకుందికి అని ప్రభుత్వం చాలా పెద్దనగరాలలో విలువైన స్థలాలను అతి తక్కువ ధరకు ఇచ్చింది. ఈ కంపెనీకి 90 లక్షల 10 రూ.విలువ గల షేర్స్ ఉన్నాయి. అంటే 9 కోట్ల మూలధనం ఉంది. అంటే ఇది నెహ్రు కుటుంబం సొంత ఆస్తి కాదు. 5000 మంది వాటాదారుల ఆస్తి. 2010కి పలు కారణాల వల్ల అంటే మరణాలు, వారసులు లేకపోవడం వంటి కారణాలతో వాటాదారుల సంఖ్య వెయ్యికి తగ్గిపోయింది. 2008 లో ఈ పేపర్ మూతపడినందువల్ల సుమారు 90 కోట్లు పైచిలుకు అప్పులు పేరుకు పోయాయి. సాధారణంగా కంపెనీ దివాళా తీస్తే కంపెనీది ఎదో ఒక ఆస్తి అమ్మి ఉన్న అప్పులు తీర్చేసి మిగిలిన సొమ్ము వాటా దారులందరికి పంచుతారు. కానీ NH విషయం లో అలా జరగలేదు…నేషనల్ హెరాల్డ్ పేపర్ ని మళ్ళీ ప్రారంభిస్తాము అని చెప్పి దానికి ఉన్న ₹90 కోట్లు అప్పు తీర్చేసుకుందికి అని కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఫండ్స్ నుండి 90 కోట్లు అప్పు ఇచ్చింది నేషనల్ హెరాల్డ్ (AJL) కంపెనీకి వడ్డీ లేకుండా. ఇన్కమ్ టాక్స్ రూల్స్ ప్రకారం రాజకీయ పార్టీ నిధులు ఇటువంటి వాటికి వెచ్చించకూడదు.
2010 లో యంగ్ ఇండియన్ కంపెనీ అని ఒక కొత్త కంపెనీ 5 లక్షల మూల ధనంతో 38% సోనియా 38% రాహుల్ మిగతా 24% ఆస్కార్ ఫెర్నాండేజ్, మోతిలాల్ ఒరా (కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్) వాటాదారులుగా ప్రారంభించారు. ఈ కొత్త కంపెనీ ఆర్టికల్స్ లో పేపర్ పబ్లిషింగ్ బిజినెస్ అని ఎక్కడా రాయలేదు.
అసలు కథ..
కాంగ్రెస్ పార్టీ తనకి నేషనల్ హెరాల్డ్ నుండి రావలసిన 90 కోట్ల అప్పుని ఈ కొత్త కంపెనీ యంగ్ ఇండియా కంపెనీకి అసైన్ అంటే బదిలీ చేసేసింది. అంటే నేషనల్ హెరాల్డ్ కంపనీ ఇప్పుడు యాంగ్ ఇండియా కంపెనీకి ఈ 90 కోట్లు అప్పు చెల్లించాలి. కానీ నేషనల్ హెరాల్డ్ అప్పు తీర్చే స్థితిలో లేదు కాబట్టి, అప్పు బదులు తన 90 లక్షల షేర్స్ ని ఒక బోర్డ్ మీటింగ్ పెట్టి మిగతా షేర్ హోల్డర్లు కి చెప్పకుండా..యంగ్ ఇండియన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసింది.. ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ తండ్రికి కూడా వాటాలు ఉన్నాయి అయినా ఇలా కంపనీ వాటాలు యంగ్ ఇండియాకు బదిలీ చేస్తున్నట్లు మాకు సమాచారం ఇవ్వలేదు అని భూషణ్ ఆరోపించారు.
అంటే కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు యంగ్ ఇండియా 90 కోట్లు బాకీ ఉంది. యంగ్ ఇండియా కి ఉన్న కాపిటల్ 5 లక్షలు మాత్రమే. 90 కోట్ల అప్పు ఎలా తీరుస్తుంది. అందుకని కాంగ్రెస్ పోనీ అని పాపం 50 లక్షలు అప్పు తీర్చండి మిగతాది రైట్ ఆఫ్ చేసుంటాం అని చెప్పింది. పోనీ ఆ 50 లక్షలు యంగ్ ఇండియా కంపెనీ దగ్గర ఉన్నాయా అంటే లేవు. అందుకని కలకత్తా లో ఒక డమ్మీ కంపెనీ (హవాలా కంపెనీ) ఒక కోటి రూపాయలు యంగ్ ఇండియాకి అప్పుగా ఇచ్చింది..ఈ కలకత్తా కంపెనీలు ఇలాగే చాలామందికి వారి దగ్గరే హార్డ్ క్యాష్ తీసుకొని మళ్లీ వాళ్లకే అప్పు ఇచ్చినట్లుగా చెక్కులు ఇస్తూ ఉంటాయి.. 1% నుండి 2% కమిషన్ తీసుకుంటాయి.
అంటే యంగ్ ఇండియా కాంగ్రెస్ కి ఇవ్వవలసిన 90 కోట్లు అప్పు పూర్తిగా తీరిపోయింది. దీంతో నేషనల్ హెరాల్డ్ ఆస్తులు సుమారు ₹2000 కోట్లు విలువైనవి సోనియా, రాహుల్ షేర్ హోల్డర్స్ గా ఉన్న యాంగ్ ఇండియా కంపెనీకి వచ్చాయి. సో ఇప్పుడు మొత్తంగా జరిగింది సింపుల్ గా చెప్పాలి అంటే ఒక 50 లక్షలు (ఎక్కడి నుండి వచ్చాయో తెలీదు) ఇచ్చి నేషనల్ హెరాల్డ్ కంపెనీవి ₹2000 కోట్ల ఆస్తులుపై యంగ్ ఇండియా కంపనీ ద్వారా సోనియా రాహుల్ హక్కులు సంపాదించారు అన్న మాట. కొసమెరుపు ఏమిటంటే అసలు కాంగ్రెస్ పార్టీ పుస్తకాలలో ఎక్కడా నేషనల్ హెరాల్డ్ కి ₹90 కోట్లు అప్పు ఇచ్చినట్లు చూపించలేదు అని సుబ్రమణ్య స్వామి ఆరోపణ. ఇంకా నేషనల్ హెరాల్డ్ కి ఢిల్లీ లో ఉన్న ఒక్క బిల్డింగ్ లో ఒక్క అంతస్తు మీదే నెలకు 80 లక్షల దాకా అద్దెలు వస్తున్నాయి. చాలా గవర్నమెంట్ ఆఫీసులు అంటే ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ వంటివి ఈ బిల్డింగ్ లో అద్దెకు ఉన్నాయి.
ఇంత అద్దెలు వస్తున్నప్పుడు మరి నేషనల్ హెరాల్డ్ వద్ద అప్పు తీర్చడానికి డబ్బులు లేకపోవడం ఏమిటీ ?
దీనిపై సుబ్రమణ్య స్వామి కోర్ట్ లో కేసు వేస్తే అరెస్ట్ నుండి తప్పించుకునేందుంకు 2015 సోనియా రాహుల్ బెయిల్ సంపాదించారు. ప్రస్తుతం ఇద్దరూ 2015 నుండి బెయిల్ మీదే వున్నారు. ఈ విచారణ ఆపాలని సోనియా రాహుల్ సుప్రీంకోర్టు కి వెళ్తే విచారణ మీద స్టే ఇవ్వలేం, విచారణకు సహకరించండి, మీరు సంఘం లో పెద్ద మనుషులు కాబట్టి స్వయంగా విచారణ హాజరు కు మినహాయింపు ఇస్తున్నాం అని చెప్పింది. ఈడీ అధికారులు బట్టి అసలు నేషనల్ హెరాల్డ్ కి ₹90కోట్ల అప్పు లేదు అని అంటున్నారు. ఈ మాయ ఛేదించడానికే ఇప్పుడు ఈడీ మనీ లాండరింగ్ క్రింద సోనియాకు, రాహుల్ కి నోటీసులు ఇచ్చింది.
