బిజెపి రాష్ట్ర శాఖ సెప్టెంబర్ 25 తేదీన పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు బిజెపి జాతీయ కార్యదర్శి వై .సత్యకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని తోలు మందం ప్రభుత్వం లో చలనం తీసుకుని వచ్చేందుకు పాదయాత్ర చేస్తాం అన్నారు. రాష్ట్రప్రభుత్వం అసమర్ధ విధానాలు ప్రజలకు వివరించి బిజెపి ప్రత్యామ్నాయం అని గుర్తు చేస్తామన్నారు. ప్రాంతాల వారీగా జోన్లలో లేదా రాష్ట్రం మొత్తం ఒకేసారి పాదయాత్ర చేయాలన్న విషయంలో బీజేపీ వ్యూహ రచన కొనసాగుతుందన్నారు. పాద యాత్ర పై త్వరలోనే రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వెల్లడించారు. అదేవిధంగా ఆగస్టు 2 వ తేదీ నుండి భారతీయ జనతా యువమోర్చా ఆ ప్లీనరీలో జాతీయ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మను ఎత్తి పడేశారు.
బీజేపీ రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దత్తు ఇవ్వమని వైసీపీని అడగలేదు.
వైసీపీ మైండ్ గేమ్ పాలిటిక్స్ ఆడుతుంది.సభలో బిల్లులకు మద్దత్తు తెలిపినంత మాత్రాన బీజేపీతో ఉన్నట్లు కాదు.రాష్ట్ర బీజేపీ శాఖ రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వమని వైసీపీని అడగలేదుధ్వర్యంలో జోన్ల వారీగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న విషయాన్ని వివరించారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించిన అంశాలపై రాష్ట్ర పదాదికారుల సమావేశంలో చర్చించాం.
వైసీపీ ప్లీనరీలో సీఎం ప్రసంగంలో మొత్తం అసత్యాలే.కేంద్రం ఇచ్చిన నిధులను సొంత పథకాలకు వాడుకొని ప్రచారం చేసుకుంటున్నారు. నిస్సిగ్గుగా చెయ్యని అభివృద్ధిని చేసినట్లు చెప్తున్నారు. సీఎం జగన్ ను చుస్తుంటే ఆత్మ స్తుతి పరనిందలా ఉంది.ప్లీనరీలో వాస్తవాలు ఎక్కడా మాట్లాడలేదు.
కేంద్రం ఇచ్చిన నిధులపై ఎక్కడైనా ప్లీనరీలో మాట్లాడారా ? అని ప్రశ్నించారు.
అభివృద్ధి అనేది జగన్ డిక్షనరీ లేదు అస్సలు అర్దం తెలీదు. పార్లమెంట్లో బిల్లుకు మద్దత్తు తెలుపుతూ రాష్ట్రంలో మాత్రం మాట మారుస్తున్నారు.ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని రాష్ట్ర పదాదికారుల సమావేశంలో తీర్మానించాం.గడికోట రిజర్వాయర్ బాధితులను ఇప్పటి వరకు ఆదుకోలేదు.సొంత నియోజకవర్గంలో పర్యటించలేని స్థితిలో సీఎం ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వం తోలు మందం ప్రభుత్వంలా ఉంది. కుటుంబ పార్టీల కు సమదూరం పాటిస్తు ఉద్యమాలు కొనసాగుతాయన్నారు. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలొ పేదలకు ఎందుకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేక పోయారని ప్రశ్నించారు. ఒక మీడియా సంస్థ అధిపతిగా ఉన్న వైసీపి తన ప్లీనరిలో మీడియా సంస్థలను టార్గెట్ చేయడం అంటే వైసీపి అధినేత ఎంత అసహనంతో ఉన్నారో అర్ధంచేసుకోవచ్చన్నారు. పాత్రికేయుల సమావేశంలో లక్ష్మీపతి రాజా పాల్గొన్నారు.