ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న విదేశీ విద్యాదీవెన ను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే టాప్ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థుల ఖర్చును భరిస్తామని.. టాప్ 100 ర్యాంక్‌లు ఉన్న యూనివర్సిటీలో సీటు సాధిస్తే.. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అంటోంది. ఏడాదికి రూ.8 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పథకం వర్తిస్తుంది.
విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు విదేశీ విద్య పథకాన్ని రాష్ట్రప్రభుత్వం మళ్లీ అమల్లోకి తీసుకురానుంది. ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పేరుతో దీన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. విదేశీ విద్య పథకాన్ని గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపు, ఇతర సామాజికవర్గాలకు చెందిన విద్యార్థులకు అమలు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విజిలెన్స్ విచారణ పేరుతో దాన్ని నిలిపేసింది. పథకాన్ని అమలు చేయాలని గత మూడేళ్లుగా వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ అమల్లోకి తీసుకురాబోతున్నట్లు పేర్కొంది.
టాప్ 200 విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన వారందరికీ సంతృప్తకర స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని ప్రకటించింది. అయితే గత ప్రభుత్వ హయాంలో పథకానికి అర్హత సాధించి విదేశాల్లో చదువుకుంటున్న కొంతమంది విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలపై మాత్రం ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు.
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించింది. వాటి ప్రకారం..
ఏపీలో విద్యార్థులకు వైయస్.జగన్ సర్కార్ మరో వరం
విదేశీ విద్యకోసం వైయస్.జగన్ మరో భారీ పథకం
జగనన్న విదేశీ విద్యాదీవెనపై ప్రభుత్వం ఉత్తర్వులు
పక్షపాతం లేకుండా ప్రతిభకే పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలు
ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ వర్తింపు
క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును భరించనున్న ప్రభుత్వం
మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్
100పైబడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపు.
నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్
ల్యాండింగ్ పర్మిట్ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లింపు
ఫస్ట్‌సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లింపు
రెండో సెమిస్టర్ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లింపు
నాలుగో సెమిస్టర్ లేదా ఫైనల్ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపు
పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏడాది వారీగా లేదా సెమిస్టర్ వారీగా కోర్సు పూర్తయ్యేంతవరకూఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపు
ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తింపు
టాప్ 200 యూనివర్శిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అందరికీ సంతృప్తకర స్థాయిలో జగనన్న విదేశీ దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్
35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా గుర్తింపు
ఏపీలో స్థానికుడై ఉండాలి, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపు
ప్రతి ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నోటిఫికేషన్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీచే ఎంపిక జరుగుతుందన్నారు..
ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ వర్తించేలా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ఇకపై వైయస్సార్‌సీపీ ప్రభుత్వమే భరించనుంది. మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. 100పైబడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించనుంది.
నాలుగు వాయిదాల్లో.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్. ల్యాండింగ్ పర్మిట్ లేదంటే ఐ–94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లింపు జమ చేస్తుంది ప్రభుత్వం. ఫస్ట్‌సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లింపు ఉంటుంది. అలాగే.. రెండో సెమిస్టర్ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లింపు, నాలుగో సెమిస్టర్ లేదంటే ఫైనల్ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపు ఉంటుంది.
అర్హతలు ఇవే
పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏడాది వారీగా లేదంటే.. సెమిస్టర్ వారీగా కోర్సు పూర్తయ్యేంతవరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపు ఉంటుంది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందని ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. టాప్ 200 యూనివర్శిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అందరికీ సంతృప్తకర స్థాయిలో జగనన్న విదేశీ దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందనుంది. వయసు.. 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులని ప్రకటించింది ప్రభుత్వం. ఏపీలో స్థానికుడై ఉండి.. అలాగే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే జగనన్న విదేశీ విద్యాదీవెన వర్తించనుంది. ప్రతి ఏటా సెప్టెంబర్–డిసెంబర్, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నొటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ చేత అర్హుల ఎంపిక ఉండనుంది.